Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్, కల్కి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని ఫ్యాన్స్ కు మంచి ఐఫీస్ట్ అందించారు. ఈ రెండు సినిమాలు రికార్డు కలెక్షన్స్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డార్లింగ్ తదుపరి చిత్రాలపై అభిమానుల ఆత్రుత ఎక్కువైంది. కల్కి 2898 ఏడీ విడుదల తర్వాత కొంత విరామం తీసుకున్న ప్రభాస్‌, త్వరలోనే రెండు కొత్త సినిమాల షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ లవ్ స్టోరీ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు పూర్తయిన ఈ చిత్రం, ప్రభాస్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రం కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ప్రభాస్‌ రెండు సినిమాలకు ఒకేసారి డేట్లు కేటాయించడంతో, దర్శకులు షూటింగ్‌ ప్లాన్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం కూడా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ‘సలార్ 2’: ‘సలార్’ సిరీస్‌ రెండో భాగం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ప్రభాస్‌ ఈ ఏడాది పూర్తిగా ఈ మూడు సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉండనున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఈ వార్తలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

Leave a comment

error: Content is protected !!