Rajasaab : ‘సలార్‌’, ‘కల్కి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ప్రభాస్‌, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా సాబ్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌ కొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మేకర్స్ కూడా ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొదట్లో షూటింగ్‌కు పరిమిత సమయం మాత్రమే కేటాయించిన ప్రభాస్‌, ప్రస్తుతం ‘రాజా సాబ్‌’ చిత్ర షూటింగ్‌పై పూర్తిగా దృష్టి సారించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సెట్‌లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘రాజా సాబ్‌’ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది. వచ్చే ఏప్రిల్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకుడు మారుతి లక్ష్యంగా పెట్టుకున్నారు. సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

‘రాజా సాబ్‌’తో పాటు, ప్రభాస్‌ ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ , ఇంకా ‘స్పిరిట్‌’ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం ప్రారంభమైంది. 2025లో ప్రభాస్‌ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ‘రాజా సాబ్‌’తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Leave a comment

error: Content is protected !!