Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కలయికలో రూపొందిన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా.. నార్త్ అమెరికాలో ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది. మొదటి వారాంతంలోనే ‘కల్కి’ మూవీ 10.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ అద్భుతమైన విజయంతో, ‘కల్కి 2898 AD’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో దీపికా పదుకోణే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితర నటులు నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

‘కల్కి 2898 AD’ చిత్రం అఖండ విజయం ప్రభాస్ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించింది. ఈ చిత్రం మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథలను అద్భుతంగా మిళితం చేసి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ‘కల్కి 2898 AD’ చిత్రం ఇదే జోరు కొనసాగిస్తే, ఖచ్చితంగా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.

Leave a comment

error: Content is protected !!