Kannappa movie : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క‌న్నప్ప’. ఇందులో దక్షిణాది నటీనటులు పలువురు క్యామియో రోల్స్ తో మెప్పించబోతున్నారు. శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయ‌న షూటింగ్ పార్ట్ కూడా పూర్తయ్యింది. ఇంక ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది.

లేటెస్ట్ గా ప్రభాస్ కన్నప్ప సెట్లో అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన అప్టేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ కాళ్ళు కనిపించేలా ఎక్స్ వేదిక గా ఒక పోస్ట్ పెట్టారు.  ఇందులో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపిస్తాడు. నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ పై కీల‌క సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ షూటింగ్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. దీంతో… ‘క‌న్నప్ప టాకీ పార్ట్ దాదాపుగా పూర్తవుతుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు మేకర్స్. పోస్ట్ ప్రొడ‌క్షన్ కోసం ఎక్కువ రోజులు స‌మ‌యం కేటాయించారు. ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకుడు.

Leave a comment

error: Content is protected !!