Prabhas : సినిమా రిలీజ్ అంటే చాలు, ప్రభాస్ విదేశీ ట్రిప్ వేసేయడం అలవాటు. ఈసారి కూడా అదే జరుగుతోంది. ‘కల్కి’ సినిమా రిలీజ్ రోజైన జూన్ 27న ప్రభాస్ భారతదేశం నుంచి ఇటలీకి బయలుదేరుతున్నాడు. అక్కడ రెండు వారాల పాటు సెలవులను ఆస్వాదించి, ఆ తర్వాత ఇండియాకి తిరిగి వస్తాడు.

ఈ నెల 27న ‘కల్కి’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు వరకు ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ వెంటనే ఇటలీకి బయలుదేరనున్నాడు. ‘ఆదిపురుష్’ , ‘సలార్’ సినిమాల విడుదలకు ముందు కూడా ప్రభాస్ ఇలానే ఇటలీకి వెళ్ళిపోయాడు. ఇటలీలో ప్రభాస్‌కు ఒక శాశ్వత గెస్ట్ హౌస్ ఉంది. అక్కడే ప్రభాస్ ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా గడపబోతున్నాడు.

తిరిగి వచ్చిన తర్వాత ‘రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ నెలలోనే ‘రాజాసాబ్’ కోసం ప్రభాస్ కొన్ని డేట్లు కేటాయించాడు. కానీ ‘కల్కి’ సినిమా ప్రమోషన్ల వల్ల షూటింగ్‌కు హాజరవ్వలేకపోయాడు. ఈలోగా, ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాలను దర్శకుడు మారుతి పూర్తి చేశారు. ఇటలీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్‌పై పూర్తి దృష్టి పెడతాడని తెలుస్తోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ సినిమాలో నటించనున్నాడు.

Leave a comment

error: Content is protected !!