Prabhas – Hanu combo :  ప్రభాస్ మరియు హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో చిత్రం ప్రారంభోత్సవం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1940ల నేపథ్యంలో యుద్ధాలు ఆధిపత్యం కోసం జరుగుతున్న కాలంలో, ఒక యోధుడు ప్రేమ కోసం పోరాడతాడు. అలాంటి విలక్షణమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభాస్ ఈ చిత్రంలో ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం దృష్ట్యా చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇమాన్ ఇస్మాయిల్ (ఇమాన్వి) ప్రభాస్‌కు జోడిగా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి,  జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణకాంత్ సాహిత్యం, సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ మరియు కమల్ కణ్ణన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!