యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. కెరీర్ లో వచ్చిన మోస్ట్ మెమరబుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ డార్లింగ్. కరుణాకరన్ దర్శకత్వంలో 2010, ఏప్రిల్ 23న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి పదేళ్ళు పూర్తి చేసుకుంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్, ముఖేష్ రుషి, ప్రభు గణేశన్, తులసి, యం.యస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఎయిటీస్ లో రీయూనియన్ ఏర్పాటు చేసుకొన్న కొందరు స్నేహితుల బృందం.. ప్రతీ పదేళ్ళకు కలవాలని నిర్ణయించుకుంటారు. అందులో ఇద్దరు స్నేహితుల కొడుకు(ప్రభాస్) , కూతురు (‘కాజల్ ) ప్రేమలో పడతారు. చిన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో విడిపోయిన ఆ జోడీ.. పెద్దయిన తర్వాత తమ ప్రేమను ఎలా గెలిపించుకుంటారనేదే మిగతా కథ. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్ కలగలిసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. జీ.వీ ప్రకాశ్ సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ అభిమానుల్ని అలరిస్తునే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇంకా ఏదో పాట అయితే.. విజువల్ వండర్స్ తో వండర్ అనిపించుకుంది. తన స్నేహితుల్ని, తను బాగా దగ్గరయిన వాళ్ళను ఎప్పుడూ డార్లింగ్ అని పిలిచే అలవాటున్న ప్రభాస్ .. దాన్నే టైటిల్ గా పెట్టుకొనికి అభిమానులకు డార్లింగ్ గా మారాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ కే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది.