‘సాహో’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం మీదే అందరి దృష్టి . గోపీకృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న అతడి  తాజా చిత్రానికి   జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్రీ పండితుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ‘ఓ.. డియర్, రాధేశ్యామ్’ అనే టైటిల్స్ లో ఒక టైటిల్ ఖాయం చేయబోతున్నారని ఎప్పటి నుంచో చెబుతున్నారు. .. ఈ పాటికి ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు.. సినిమా విడుదల తేదీ సైతం ఖాయం అయిపోయేది.  కానీ లాక్ డౌన్ కారణంగా అలా జరగలేదు.   కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో కూడా  సాహసోపేతంగా జార్జియా వెళ్లి కీలక ఘట్టాల్ని పూర్తి చేసుకుని క్షేమంగా ఇండియా తిరిగి వచ్చింది చిత్ర బృందం.

ఆ తరువాత టీమ్  టీమ్ అంతా హోమ్ క్వారెంటైన్ కె పరిమితం అయిపొయింది. ఫస్ట్ లుక్ వస్తుందని ఫాన్స్ ఎదురుచూసారు. అది కుదిరేలా లేదని తెలిసి సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పై యుద్ధమే ప్రకటించారు. దీంతో మేకర్స్ కరోనా కారణంగా ఫస్ట్ లుక్ సాధ్యం కావడం లేదని జూన్ వరకు ఆగమని విజ్ఞప్తి చేయడంతో ఫాన్స్ వెనక్కి తగ్గి తాజాగా ఈచిత్రానికి ‘రాధేశ్యామ్’ టైటిల్ ని కన్ఫర్మ్ చేయమని ప్రచారం చేయడం ఆసక్తి కరంగా మారింది. ఇదిలా ఉంటే ఫాన్స్ ఫైనల్ చేసిన ‘రాధేశ్యామ్‘ టైటిల్ నే యువీ  క్రియేషన్స్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇదే టైటిల్ ని మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు.

Leave a comment

error: Content is protected !!