చిత్రం: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1
నటి నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్ మరియు ఆర్. పార్తిబన్ తదితరులు..
ఛాయాగ్రహణం: రవి వర్మన్
మ్యూజిక్ డైరెక్టర్: రెహమాన్
నిర్మాత: మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
తెలుగులో విడుదల: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రచన, దర్శకత్వం: మణిరత్నం
రీలిజ్ డేట్: 30 సెప్టెంబర్ 2022
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నాలుగేళ్ళ విరామం తరువాత చేసిన సినిమా “పొన్నియిన్ సెల్వన్”. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయరామ్ ఇలా ఎంతో మంది అగ్ర దిగ్గజాలు కలిసి నటించిన సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. తమిళియన్ లు పొన్నియిన్ సెల్వన్ కథ తెర మీద చూడాలని, అలాగే తమిళ ప్రేక్షకుల కు ప్రతిష్ట మరియు గౌరవం ఈ కథ. మరి ఈ సినిమా కథ ఏంటో తెలుసుకోవాలి అంటే వివరాల్లోకి వెళ్దాం.
కథ: పొన్నియిన్ సెల్వన్ కథ దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట జరిగింది. సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) తన తర్వాత వారసుడిగా పేద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను చోళ సామ్రాజ్యాధినేతగా ప్రకటిస్తాడు. ఆ తీర్పు కి వ్యతిరేకంగా పళు వెట్టరాయ్ (శరత్ కుమార్) సామంత రాజులు అందరినీ ఏకం చేసి పన్నాగం పన్నుతాడు. ఈ విషయం వల్లవరాయన్ వందియ దేవుడు (కార్తీ) ద్వారా తెలుసుకున్న సుందర చోళుడు కుమార్తె కుందైవై (త్రిష) దానికి ధీటుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. చోళ సామ్రాజ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఆదిత్య కరికాలుడు, కుందైవై తెలుసుకుంటారు. కానీ, పళు వెట్టరాయర్ భార్య నందిని దేవి (ఐశ్వర్యా రాయ్ బచ్చన్) చోళ రాజ్యంలో ఉన్నంత వరుకు తిరిగి రాను అని ఆదిత్య కరికాలుడు మొండి పట్టు పడతాడు? లంక లో ఉన్న ఆదిత కారికాలన్(జయం రవి) ని చోళ రాజ్యానికి ఎందుకు తిరిగి రమ్మన్నారు? తిరిగి వస్తున్నప్పుడు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
కధనం,విశ్లేషణ: ఎన్ని తరాలు మారిన చారిత్రాత్మక కథలు అంటే తెలుగు ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. అలాంటి గొప్ప చారిత్రాత్మక కథ “పొన్నియిన్ సెల్వన్”. నావెల్ కథ లని తెరపైకి తీసుకు రావడం ఆషామాషి విషయం కాదు. కానీ, తెరకెక్కించిన కొంత మంది డైరెక్టర్ లు సక్సెస్ & ఫెయిల్యూర్ రెండు చూసారు. బాహుబలి, బింబిసారా, కెజిఎఫ్ ఇలాంటి సూపర్ హిట్ గ్రాండియర్ సినిమాలు తరువాత పొన్నియిన్ సెల్వన్ సినిమాని తెరకెక్కించిన “మణిరత్నం” సక్సెస్ అయ్యారో లేదో వివరాల్లోకి వెళ్దాం.
డైరెక్టర్ మణిరత్నం ఉన్న టాలెంట్ కి రామాయణ, మహాభారతం కథలు కూడ చాలా అవలీల గా చేయచ్చు. కానీ, ఇలాంటి చారిత్రాత్మక కథలు ఎంచుకున్నప్పుడు ఏ మాత్రం ఏమరుపాటు ఉన్న బోల్తా కొట్టే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి కథని సవాల్ గా తీసుకొని ‘పొన్నియిన్ సెల్వన్’ అంటూ చోళ సామ్రాజ్య చరిత్రను తెరకెక్కించారు.
రాజ్యాలు, యుద్ధాలు, రాజ కుటుంబంలో కుట్రలు ఇవ్వన్నీ సగటు ప్రేక్షకుడి కి చాలా ఇంటరెస్టింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఈ సినిమా మొదట్లోనే విక్రమ్, కార్తీ ఇద్దరు కలిసి మరో రాజ్యం మీద దండయాత్ర చేస్తారు. కానీ, ఇద్దరు హీరో లకి సరైన ఎలివేషన్ లేకపోవడం పైగా చేసే యుద్ధం లో పస లేకపోవడం కనిపిస్తాయి. సినిమా సాగే కొద్దీ ఫస్ట్ ఆఫ్ అంత కార్తీ ద్వారా కథ ముందుకి వెళ్తుంది. ఒక విధంగా సినిమా కి కార్తీ పాత్ర ఊపిరి పోసింది అనే చెప్పాలి. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కంటే డ్రామా ఎక్కువగా ఉండటం, చెప్పుకోదగ్గ సాంగ్స్ లేకపోవటం మైనస్ అనే చెప్పాలి. అలాగే, మేజర్ క్యారెక్టర్ల్ కి చెప్పుకోదగ్గ బలమైన సన్నివేశాలు లేకపోవడం సగటు ప్రేక్షకుణ్ణి నిరాశపరుస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే క్యారెక్టర్ల పేర్లు, రిలేషన్స్ అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది.
సెకండ్ ఆఫ్ లో జయం రవి కనిపించినంత సేపు ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా, జయం రవి & కార్తీ మధ్య జరిగే ఫైట్ ఆకట్టుకుంటుంది. పాండ్యులు వర్గం తో ఓషన్ లో జరిగే ఫైట్ ఇంట్రస్టింగ్ గా ఉన్న వీఎఫ్ఎక్స్ తేలిపోయాయి. జయం రవి కి ఆపద వచ్చిన ప్రతి సారి అతన్ని కాపాడే మహిళ ఎవ్వరు? అనేది స్క్రీన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది. టైటిల్ రోల్ పోషించిన జయం రవి సినిమా క్లైమాక్స్ లో చనిపోయాడా లేదా అనేది పార్టీ 2 లో తెరకెక్కుతుంది?
అభిమానులకు మణిరత్నం సినిమాల మీద చాలా అంచనాలు ఉంటాయి. కొన్ని వర్గాల వారికి అయన సినిమాలు చాలా సాగదీత గా ఉంటాయని విమర్శ కూడ ఉంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడా కనిపించకపోవడం. ఎమోషన్స్ పెద్దగా లేకపోవటం. బహుశా, ఈ సినిమా చుసిన తరువాత ఆ విమర్స మళ్ళి వినిపించవచ్చు.
నటి నటుల పెర్ఫామెన్స్: విక్రమ్, ‘జయం’ రవి పాత్రలు స్క్రీన్ స్పెస్ తక్కువ ఉన్నప్పటికి కనిపించినంత సేపు అలరిస్తారు. ముఖ్యంగా, విక్రమ్ చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైపోయింది అనే బాధ తనని కలిచి వేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యుద్ధ సన్నివేశాల్లో జయం రవి కళ్ళల్లో ఇంటెన్సిటీ మరియు భావోద్వేగభరిత సన్నివేశాల్లో మెప్పిస్తారు. ఇకపోతే, కార్తీ రోల్ సినిమాలో అత్యంత అద్భుతంగా ఉంటుంది. కార్తీ తో సాగే కొన్ని సన్నివేశాలు అందరిని బాగా నవ్విస్తాయి. ఒక విధంగా చెప్పాలి అంటే సినిమా కి హైలైట్ హీరో కార్తీ. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, జయరామ్ తదితరులు పాత్రల మేరకు బాగా రాణించారు కానీ, వాళ్ళకు పెద్దగా నటించి మెప్పించే అవకాశం లేకపోయింది.
ఇకపోతే, కథానాయికలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద వీరనారులు గా కనిపిస్తారు. ముఖ్యంగా, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అందం చూపించిన తీరు స్క్రీన్ మీద ప్రతి ఒక్కరు ట్రాన్స్ లోకి వెళ్తారు. అదే విధంగా త్రిష లుక్స్ తో పాటు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది అనే చెప్పాలి. సినిమాలో శోభిత లుక్స్ కృష్ణుడిని గుర్తు చేసేలా ఉంటుంది. ఐశ్వర్య లక్ష్మి కనిపించింది కాసేపే అయిన క్యారెక్టర్లో లీనమైపోయింది.
సాంకేతికవిభాగం: ముందుగా ఇలాంటి చారిత్రాత్మక కథ ని ముందుకి తీసుకొచ్చిన మణిరత్నం గారికి హ్యాట్సాఫ్. కానీ, ప్రతి విభాగంలో అనుకున్నంత అవుట్ ఫుట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. కాకపోతే, ప్రతి క్యారెక్టర్ లుక్స్ & డిజైన్ బాగా తీర్చిదిద్దారు. రవి వర్మన్ ఇచ్చిన ఛాయాగ్రహణం పని తీరు అంత అంత మాత్రం గా ఉంది. రెహమాన్ అందించిన సంగీతం ఒక మాదిరిగా బాగున్నా ఇంకా బెస్ట్ ఇచ్చి ఉంటె బాగుండేది. ఎడిటింగ్ ఓవర్ ఆల్ గా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: పర్వాలేదు అనిపించిన “పొన్నియిన్ సెల్వన్”