Polimera 3 : మా ఊరి పొలిమేర టాలీవుడ్‌లోని టాప్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచిపోయింది. కరోనా టైమ్ లో మొదటి భాగం.. నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. రెండవ భాగం మా ఊరి పొలిమేర గత సంవత్సరం విడుదలైంది. రెండింటికీ ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ దక్కింది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఇప్పుడు మూడవ భాగం పొలిమేర3 ని టీజర్ గ్లింప్స్ తో పాటు ప్రకటించారు.

రిటర్నింగ్ లీడ్స్‌తో పాటు, ఈ భాగం కోసం పలువురు కొత్త నటీనటులు తారాగణంలో చేరారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయి.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సత్యం రాజేష్ తన పాత్రను కొనసాగిస్తుండగా బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, పృథ్వీరాజ్ మరియు రాకేందు మౌళి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పొలిమేర2 ని పంపిణీ చేసిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!