పవన్ కళ్యాణ్ ‘వకీలు సాబ్’ సినిమాపై సుధాకర్‌ అనే వ్యక్తి సోమవారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సినిమాలోని ఓ సన్నివేశంలో హీరోయిన్ అంజలి ఫొటోలను అసభ్యకరంగా చూపిస్తూ దాని కింద తన ఫోన్‌ నంబర్ ను చూపించారు. తన అనుమతి లేకుండా అలా చేసినందుకు ఎందరో గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్లు వస్తుండడంతో అసౌకర్యానికి ఆవేదనకు గురైనట్లు పోలీసులకు తెలియపరిచాడు. ఈ కారణం చేత చిత్ర యూనిట్‌ సభ్యులపై కేసు నమోదు చేయాలని పోలీసులని కోరాడు. పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.

Leave a comment

error: Content is protected !!