చిత్రం : ప్లే బ్యాక్

నటీనటులు : దినేష్ తేజ్, అనన్య , అర్జున్ కళ్యాణ్, టివి5 మూర్తి, స్పందన, టీఎన్ ఆర్, చక్రపాణి, అశోక్ వర్ధన్, కార్తికేయ తదితరులు.

సంగీతం : కమ్రన్

సినిమాటోగ్రఫీ : బుజ్జి.కె

ఎడిటింగ్‌ : నాగేశ్వర రెడ్డి బొంతల

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్

నిర్మాత : ప్రసాదరావు పెద్దినేని

దర్శకత్వం : హరి ప్రసాద్ జక్కా

విడుదల తేది : 05-03-2021

‘ప్లే బ్యాక్’ చిత్రం టీజర్ ట్రైలర్ లో చూపిన భూతకాలం నుంచి వర్తమానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే అనే ఆసక్తి కరమైన ఆలోచనతో రూపొందించిన చిత్రం ఇది. ప్లే బ్యాక్”. సుకుమార్ వద్ద పలు చిత్రాలకు వర్క్ చేసిన హరిప్రసాద్ చిత్ర దర్శకుడు హుషారుఫేమ్ దినేష్ తేజ్, “మల్లేశంఫేమ్ అనన్య తారాగణం పోషించిన ఈ సినిమా ఆడియన్స్ కు ఎటువంటి అనుభూతిని కలిగించిందనేది రివ్యూలో చూద్దాం…

కథ: ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా సుజాత (అనన్య) పని చేస్తుంటుంది. జర్నలిస్ట్ కావాలనే ఆలోచనలతో ఓ మీడియా ఛానల్లో పని చేయాలనే కార్తీక్ (దినేష్ తేజ్) కు ఒక రోజు తను ఉంటున్నఇంట్లోని ఓ ల్యాండ్ ఫోన్ కి వచ్చిన కాల్ తో సినిమా ఆసక్తి కరంగా మొదలవుతుంది. అలా మాట్లాడుకున్న రెండు మూడు రోజుల తర్వాత సుజాత ఉన్నది 1993లో అని, కార్తీక్ ఉన్నది 2019లో అని తెలుస్తుంది. ఈ 26 ఏళ్ల గ్యాప్ కి, టెలిఫోన్ కనెక్షన్ కి సంబంధం ఏమిటి? ఇంతకి సుజాత-కార్తీక్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రస్తుతంలో ఉన్న కార్తీక్ ఫోన్ ద్వారా గతంలో సుజాత భవిష్యత్ ను ఎలా మార్చాడు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేషణ : ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ప్రేమ కథను జోడించి తెరకెక్కించారు. కార్తి (దినేష్ తేజ్) జర్నిలిస్ట్ కావాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ టీవీ 5లో ఉద్యోగంలో చేరతాడు. అద్దె ఇంటి యజమానితో గొడవ కారణంగా ఇంకో ఇంటికి మారతాడు. ఆ ఇంట్లోకి వెళ్లాక అక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ కనిపిస్తుంది. ఈరోజుల్లో ఈ ఫోన్ ఎక్కడిది అనుకునే సందర్భంలో ఆ ఫోన్ రింగవుతుంది. ఓ అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఆమె సుజాత (అనన్య నాగెళ్ల). ఆమెకు సెల్ ఫోన్, వెబ్ సైట్లు లాంటి వాటి గురించే తెలియదు. ఆమె కోసం పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళితే కనిపించదు. చివరికి అతను తనకు తెలిసిన అంశాలను పరిశీలించిగా.. షాకింగ్ విషయంగా ఆ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఎప్పుడో కట్ చేసి ఉంటుంది. కానీ ఆమె నుంచి ఫోన్ వస్తూనే ఉంది. పైగా ఆమెకి అతనికి గతంలో ఓ పరిచయం కూడా ఉంది. ఆమె పెద్ద ప్రమాదంలో ఉందని కూడా అర్థమైంది. ఇలాంటి పరిస్థితిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ : మల్లేశంఫేం అనన్య, ‘హుషారుఫేం దినేష్ తమ పాత్రలు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి.  కనిపించిన మేరా టిఎన్ఆర్, టివి 5 మూర్తి తదితరులు తెరపై చేసిన ప్రయత్నం పర్వాలేదు.

 టెక్నిషియన్స్ పనితనం : ఈ చిత్రం కథ పరంగా సైన్స్ ఫిక్షన్ కాబట్టి చాలా థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు రూపొందించారు. ఈ కథకు స్ఫూర్తి ఏదైనా కూడా దర్శకుడు తనకున్న ఫిజిక్స్ నాలెడ్జిని దీని మేకింగ్ కోసం బాగానే ఉపయోగించుకున్నారు. ఇలాంటి అంశాన్ని సులభంగా చెప్పగలగాలి అనే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సెకండ్ హాఫ్ బాగా ఎంగేజ్ చేశాడు డైర‌క్ట‌ర్ . అనవసర కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి దర్శకుడు వెళ్లలేదు.  నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. ఈ సినిమా దర్శకుడు జక్కా హరిప్రసాద్ ఎన్నుకున్న ఈ కొత్త కాన్సెప్ట్ కు మంచి పేరు వస్తుంది.

రేటింగ్ : 2.25/5

Leave a comment

error: Content is protected !!