FNCC : హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటైన పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ చాలా ఘనంగా జరిగింది. శ్రీ వి. సూరన్న మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గా పేరు పెట్టి గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో యాక్టివిటీస్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ తో ఇంకా ముందు ముందు మరిన్ని టోర్నమెంట్స్, ఆక్టివిటీస్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ కోర్ట్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా సినీ దర్శకులు పి. సాంబశివరావు , FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డా. కే. ఎల్. నారాయణ , ఆనంద్ సినీ సర్వీస్ పి. కిరణ్ పాల్గొన్నారు. వీరితోపాటు FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు , వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్ , ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి , జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు , ఇంకా కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ , శ్రీమతి శైలజ జూజల , ఎ.గోపాలరావు, ఏడిద సతీష్ (రాజా) , సామ ఇంద్రపాల్ రెడ్డి , డోనర్ వి. నిరంజన్ బాబు , తదితర సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!