విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘పెత్తందార్లు’. అభ్యుదయ భావాలు కలిగిన కథతో సి.యస్.రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను యు.విశ్వేశ్వరరావు నిర్మించారు. 1970, ఏప్రిల్ 30న విడులైన ఈ సినిమా సరిగ్గా నేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. సావిత్రి, శోభన్  బాబు, విజయనిర్మల, నాగభూషణం, ముక్కామల, ావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, రాజబాబు   ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు కె.వి.మహాదేవన్ సంగీతం అందించారు. ఏకాంత సేవకు, నాదేశం కోసం , మైమరపో తొలివలపో లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. రైతులకు పెత్తందార్లకు మధ్య జరిగే వర్గ పోరాటం గా పెత్తందార్లు చిత్రం తెరకెక్కింది. అమాయకులైన రైతుల పొట్టకొడుతూ.. కాసులు కూడబెట్టిన ఓ ముగ్గురు..  పెద్దమనుషులనే ముసుగులో చేసే అకృత్యాల్ని ఎండగడతాడు కథానాయకుడు. ఊరి జనంలో చైతన్యం తీసుకొచ్చి వారిపై తిరుగుబాటు చేయడమే చిత్ర కథ. అప్పట్లో   ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. యన్టీఆర్ సినీ కెరీర్ కు మరింతగా బూస్టప్ నిచ్చిన చిత్రంగా పెత్తందార్లు చిత్రం నిలిచిపోయింది.

Leave a comment

error: Content is protected !!