కరోనా మహమ్మారి దెబ్బ అన్నిరంగాలకు చాలా ఎక్కువగా తగిలింది . లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం స్తంభించిపోయింది. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్‌ను వాయిదా వేయడంతో సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏరోజుకారోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో వారికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో వీరికి అండగా ఉండేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సిసిసి పేరుతో చిరంజీవి నాయకత్వంలో సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు విరాళాలు అందజేసి దాత్రుత్వాన్ని చాటుకున్నారు. కాగా ఇప్పుడీ జాబితాలోకి ఇద్దరు  టాలీవుడ్ ప్రముఖులు కూడా చేరారు.

ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్. తమ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం ఇది అంటారాయన. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. తమ సంస్థలైన పీపుల్ టెక్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉద్యోగుల ఒకరోజు వేతనానికి సమానంగా మరికొంత మొత్తాన్ని జతచేసి, మొత్తంగా రూ.25 లక్షలను మంగళవారం ఉదయం టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్.ను.. సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లతో కలసి చెక్ రూపంలో అందించారు నిర్మాత టి.జి. విశ్వప్రసాద్. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన‌ చేశారు.

Leave a comment

error: Content is protected !!