ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులనుంచి సెలబ్రిటీస్ వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని పలువురు వివిధరకాలుగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ .. ఈ విషయంలో చాలా ముందున్నారు. కొందరు ఇంటిపనులు, వంట పనులు చేస్తుంటే.. మరికొందరు కథలు, కవిత్వం, చిత్రలేఖనం లాంటి వాటిలో తమ ప్రతిభ చూపిస్తున్నారు. ఇంకొందరు తమకిష్టమైన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు చక్కగా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పుడు పాయల్ కూడా అదే పని చేస్తోంది. రోజూ కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటోంది. తన క్వారంటైన్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతోంది. ఇవి కాకుండా ఇప్పుడు మరో పని కూడా చేసింది పాయల్. ఏకంగా ఓ షార్ట్ ఫిలిం తీసి రిలీజ్ చేసింది. లాక్ డౌన్ టైమ్ లో షూటింగ్స్ లేవు కదా, మరి ఈ షార్ట్ ఫిలిం ఎలా తీశారనే కదా మీ అనుమానం. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలింను కేవలం ముగ్గురు వ్యక్తులు కలిసి, ఇంట్లోనే తీశారు. అది కూడా జస్ట్ 24 గంటల్లో పూర్తిచేశారు. అందులో కీలక పాత్ర పాయల్ పోషించింది. 16 నిమిషాల షార్ట్ ఫిలింలో దాదాపు 14 నిమిషాలు ఆమె మాత్రమే కనిపిస్తుంది. అంటే కథ మొత్తం పాయల్ చుట్టూనే తిరుగుతుందన్నమాట. ఈ షార్ట్ ఫిలింకు ‘ఏ రైటర్’ అనే పేరుపెట్టారు. ఈ షార్ట్ ఫిల్మ్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.