ఆర్‌ఎక్స్‌ 100 తో యూత్‌ హార్ట్‌ త్రోబ్‌ గా మారిన ‘పాయల్‌ రాజ్‌పుత్‌’ .. ‘మంగళవారం’ మూవీతో మంచి యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంది. హాట్‌ హీరోయిన్‌ గా ఇమేజ్‌ వచ్చినా యాక్టింగ్ కు స్కోప్‌ ఉన్న పాత్రలతో రాణిస్తోంది. మంగళవారం తర్వాత మరోసారి తన నటనతో యూత్‌ని ఎట్రాక్ట్ చేయడానికి ‘వెంకటలచ్చిమి’ గా రాబోతుంది. ట్రైబల్‌ గర్ల్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాతో వెంకటలచ్చిమి తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియో ఘనంగా జరిగింది.
రాజా, ఎన్‌ఎస్‌ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ముని కథ, స్క్రీన్‌ ప్లే , డైరెక్షన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్ట్రెయిట్‌ తెలుగు మాత్రమే రిలీజయిన పాయల్‌ రాజ్‌పుత్ మూవీస్‌.. వెంకటలచ్చిమి ని మాత్రం ఆరు భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. వెంకటలచ్చిమి మూవీ తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ , హిందీ , పంజాబీ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!