మంగళవారంటైటిల్‌తోనే ఆడియెన్స్‌లో బజ్‌ క్రియేట్ చేసిన మూవీ. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత అజయ్‌భూపతి డైరెక్షన్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ మెయిన్ లీడ్ చేస్తున్న మూవీ ఇది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మల ముద్ర మీడియా వర్క్స్‌ బ్యానర్‌, అజయ్‌భూపతి క్రియేటివ్‌ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మంగళవారంమూవీ నవంబర్‌ 17 న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో సినిమా విశేషాలు ముచ్చటించింది పాయల్‌ రాజ్‌పుత్.

ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత అజయ్‌ భూపతి ని ఎన్నోసార్లు చాన్స్ ఇవ్వమని వెంటపడ్డా. చిన్న చిన్న క్యారెక్టర్స్‌ ఇవ్వలేను.. టైమ్‌ వచ్చినపుడు నేనే చెప్తా అన్నారు. ఒకసారి ఫోన్‌ చేస్తే మంగళవారం సినిమాకు ఆడిషన్స్‌ చేస్తున్నానన్నారు. నాకెందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు.. నా కెరీర్‌కి హెల్ప్‌ అవుతుంది కదా అంటే.. ఆడిషన్స్‌ చేసి నన్ను సెలెక్ట్ చేసారు అజయ్‌ భూపతి అన్నారు పాయల్‌ రాజ్‌ పుత్.

ఈ చిత్రంలో తన క్యారెక్టర్‌ గురించి చెప్తూ.. ” ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్‌,కథ ఎవ్వరూ చేయలేదు. ఇంతకు ముందు డార్క్‌, ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ చేసాను కానీ.. ఇలాంటి పాత్ర మాత్రం చేయలేదు. ఈ క్యారెక్టర్‌కు రియల్‌ లైఫ్‌లో నాకూ.. కనీసం 10 శాతం కూడా పోలిక లేదు. ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా కష్టపడ్డా.. షూటింగ్ తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి ఎమోషన్‌ నుంచి బయటకు రావడానికి చాలా టైమ్‌ పట్టింది. మేకప్‌కే చాలా టైమ్‌ పట్టేది. ఓసారి ఈ మేకప్‌తో అమ్మ దగ్గరకు వెళ్తే.. చేతికి ఆ గాట్లు ఏంటి.. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావన్నారుఅంటూ మెమరీస్‌ పంచుకున్నారు.

ఇక అల్లుఅర్జున్‌ రియాక్షన్‌ గురించి చెప్తూ.. “ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చూసి సిగ్గు వచ్చేసింది. ఆయన మాత్రం నా క్యారెక్టర్‌ గురించి చెప్తూ.. ఇండియాలో ఇలాంటి క్యారెక్టర్‌ ఎవ్వరూ చేయలేదు.. చాలా కష్టం కూడా.. నిన్ను చూస్తే గర్వంగా ఉందిఅన్నారని చెప్పారు పాయల్‌.

మిగతా ఆర్టిస్టులు నందిత శ్వేత, అజ్మల్‌ అమీర్‌లు.. కథలో ట్విస్టులు రివీల్ కావడంలో వీరి పాత్రలు కీలకం.. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాపై నమ్మకం ఉన్నా కాస్త నెర్వస్‌గా కూడా ఉంది.. అవుటాఫ్‌ ది బాక్స్‌ వచ్చి చేసిన సినిమా ఇది. తప్పకుండా ధియేటర్‌లోనే చూడండిఅన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌.

Leave a comment

error: Content is protected !!