ఎక్కడికి ఈ పరుగు.. ఎందుకనీ ఈ ఉరుకు అనే పాట చాలా పెద్ద హిట్. మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ సాంగ్. వంశీ డైరెక్షన్లో వచ్చిన వైఫాఫ్ వి వరప్రసాద్ అనే మూవీ సక్సెస్ కాకున్నా పాట మాత్రం ఆల్‌టైమ్ హిట్ గా నిలిచింది. వినీత్, అల్ఫన్సా, అవని కాంబినేషన్లో వచ్చిన ఈ పాటలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉండుంటే ఎలా వుండేది.? యాక్చువల్లీ ఈ పాటలోనే కాదు మూవీలో కూడా పవర్ స్టార్ యాక్ట్ చేయాల్సి వుంది. ఈ మూవీకి సంబంధించి పవర్‌స్టార్ తో పాటు మరికొన్ని ఇంట్రస్టింగ్ విషయాలున్నాయి. డిటెక్టివ్ నారద, జోకర్, ప్రేమ అండ్ కో, నీకు 16 నాకు 18, లింగబాబు లవ్‌స్టోరీ లాంటి వరుస ఫ్లాపుల తర్వాత దాదాపు మూడు సంవత్సరాల వరకు వంశీ సినిమాలు తీయలేదు. ఈ గ్యాప్ తర్వాత వంశీ తీసిన మూవీనే వైఫాఫ్ వి వరప్రసాద్. ఈ సినిమాకి నిర్మాత రామ్‌గోపాల్ వర్మ. అన్వేషణ సినిమాను 22 సార్లు చూసి వంశీ వర్క్ స్టైల్‌కి ఫ్యాన్ అయిన వర్మ.. ఆయనతో కలిసి చేసిన ఒకే ఒక్క సినిమా ఇది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందు రామ్‌గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కి ఈ మూవీ కథ చెప్పడం జరిగింది. అయితే ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ కి నచ్చకపోవడంతో నో చెప్పాడట. కానీ పవన్ డెసిషన్ వర్మకు నచ్చలేదు. ఫైనల్‌గా పవర్‌స్టార్ డెసిషన్ కరెక్ట్ అని ఈ సినిమా ఫ్లాపయ్యాక తెలుసుకున్నాడు వర్మ. ఆ తరువాత కలిసినపుడు నువ్వే రైట్ అంటూ పవన్‌కు కితాబిచ్చాడట వర్మ. సో ఈ మూవీలో పవన్ నటించి వుంటే ఒక మంచి పాటైతే వచ్చేదేమో కానీ మంచి హిట్ సినిమా అయితే కాదు.