Pawan Kalyan : ;పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీ కాబోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఓజీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఆయనకు కేవలం పదిహేను రోజుల వర్క్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. పవన్ కళ్యాణ్ జూన్ నెలాఖరు నుంచి డేట్స్ ఇచ్చారు.

ఇంక మిగిలిన పార్ట్ లో పవన్ లేని సన్నివేశాలే ఉంటాయి. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, సీన్ కక్కర్, హరీష్ ఉత్తమ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ నటించిన పాన్ ఇండియా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది.

Leave a comment

error: Content is protected !!