పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్‌’ కు సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటిపాట ‘మగువ..మగువ’.. రెండోది ‘సత్యమేవ జయతే’. ఇవి రెండు కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతూ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ‘కంటిపాప..కంటిపాప’ అనే పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించిన పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కాగా అర్మాన్ మాలిక్ పాడగా, తమన్‌ సంగీతాన్ని అందించారు.

Leave a comment

error: Content is protected !!