Harihara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో మాత్రమే కాదు, మంచి గాయకుడు కూడా అనే విషయం అందరికీ తెలిసిందే. ‘తమ్ముడు’, ‘ఖుషి’ వంటి చిత్రాల్లో తన గొంతుతో ప్రేక్షకులను అలరించిన పవన్, ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో కూడా తన గాత్రాన్ని అందించినట్టు టాక్. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరకల్పనలో సాగిన ఈ పాట.. చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ ప్రస్తుతం విజయవాడలో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలకమైన యుద్ధ దృశ్యాలు తెరకెక్కుతున్నాయి. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం సమర్పిస్తున్నారు. ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 28, 2025న ఈ చిత్రం విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!