కథ విన్న వెంటనే పవర్‌స్టార్ షూటింగ్ ఎప్పుడు అని అడిగారు.. పవర్‌స్టార్ నుంచి ఇలాంటి షార్ప్ రియాక్షన్ వచ్చిందంటే ఆ డైరెక్టర్ ఎంత షాక్ అయ్యింటారు.. సముద్రఖని పరిస్థితి కూడా అంతేనా..? భీమ్లానాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయితే.. మళ్లీ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తారో అని అనుకున్నారు. కానీ సముద్రఖని మాత్రం బ్రోతో షార్ట్ టైమ్‌లోనే పవర్ మ్యాజిక్ చూపించబోతున్నాడు. జులై 28 న ప్రపంచవ్యాప్తంగా బ్రో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సముద్రఖని పాత్రికేయులతో సినీ విశేషాలు పంచుకున్నారు.
పవర్‌స్టార్ తో సినిమా అంటే అంత ఈజీ కాదు.. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ చెప్పినపుడు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో సముద్రఖని చెప్తూ.. ఈ కథ చెప్పగానే పవర్‌స్టార్ షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నారని అడిగారట. మీరు ఓకే చెప్తే రేపు వెంటనే స్టార్ట్ చేద్దామన్నారట సముద్రఖని.. ఇలా వెంటనే సినిమా ఓకే అయ్యింది. మొదటి రోజు లొకేషన్ కి రాగానే పవర్‌స్టార్ అంతటా అబ్జర్వ్ చేస్తారనీ.. నా డెడికేషన్ ఆయనకు బాగా నచ్చిందన్నారు సముద్రఖని. టైమ్ వేస్ట్ కాకుండా లొకేషన్లోనే కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసుకునేవారన్నారు. ఇక ఈ సినిమా పవన్ తో ఓకే కావడం వెనుక త్రివిక్రమ్ గారున్నారని చెప్పారు. కరోనా టైమ్‌లో ఓటీటీ కోసం చేసిన వినోదయ సిత్తం సినిమా గురించి చెప్పగానే.. త్రివిక్రమ్ ఎగ్జయిట్ అయ్యారట. కోవిడ్ టైమ్ కావడంతో ఎవరూ యాక్ట్ చేయడానికి ముందుకు రాకపోవడంతో తానే చేసినట్టుగా చెప్పారట. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ పవన్ ని ఒప్పించారట. పవర్‌స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు కథలో త్రివిక్రమ్ గారే మార్పులు చేసారన్నారు. ఇక సాయితేజ్ తో పవర్‌స్టార్ సీన్స్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తాయన్నారు. ఈ సినిమా మొత్తం 53 రోజుల్లో షూట్ చేసారట. ఏ రోజు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా షూటింగ్ చేయడంతో ఇంత తక్కువ టైమ్ లో పూర్తి చేయగలిగినట్టు చెప్పారు. మ్యూజిక్ ఇచ్చిన థమన్ గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండాలనిపిస్తోందన్నారు. అంత బాగా ఆర్ ఆర్ ఇచ్చారట. తన 15 సినిమాల కెరీర్లో థమన్ మ్యూజిక్ కళ్ల నీళ్లు పెట్టించిందన్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ,కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ మెయిన్ లీడ్‌లో కనిపిస్తున్న బ్రో మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. జులై 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.