ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ నెం. 1 ప్లేయర్ సైనా నేహ్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో ” సైనా ” బయోపిక్ తెరకెక్కతోంది.  ఈ చిత్రంలో బాలీవుడ్ నటి, పరిణీతి చోప్రా టైటిల్ రోల్ లో నటిస్తుస్తున్నారు. అయితే ఈ పాత్రకు పర్నీతి చోప్రా కన్నా ముందుగా అనుకున్న హీరొయిన్ శ్రద్ధా కపూర్‌. కొన్ని కారణాల వల్ల తను సినిమా నుండి తప్పుకోవడం జరిగింది.  అమోల్ గుప్తా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని కంఫార్మ్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. మార్చ్ 26 న ఈ సినిమా రిలీజ్ కానుంది.  ఈ సినిమా ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైం సొంతం చేసుకుంది.

Leave a comment

error: Content is protected !!