తెలుగు ప్రేక్షకులు క్రైం థ్రిల్లర్ మూవీస్ కి ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అందుకే అప్ కమింగ్ డైరెక్టర్లు కానీ… అప్ కమింగ్ నటీనటులు కానీ.. ఇటాంటి జోనర్ సినిమాలను తెరమీద చూపించడానికి ఇష్టపడుతుంటారు. సింపుల్ కథ.. కథనాలతో తెరమీద ఇలాంటి కథలను మంచి గ్రిప్పింగ్ తో చూపించగలిగితే.. బాక్సాఫీస్ బద్దలే. నిర్మాతలకు మంచి పేరుతో పాటు కాసులు కూడా గలగలలాడుతాయి. ఇలాంటి ఫ్రెష్ లైన్ అండ్ స్క్రీన్ ప్లేతో మన ముందుకు వచ్చిన చిత్రమే ‘పరుగెత్తు పరుగెత్తు’ నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో లెట్స్ సీ . 

కథ: అజయ్(సూర్య శ్రీనివాస్ ) బాగా చదువుకొని ఏదైనా బిజినెస్ చేసి జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వుండాలనుకునే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. అతనికి రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేసే ప్రియ(అమృత) పరిచయం అవుతుంది. వీరిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటి కావడంతో ఇద్దరూ ప్రేమలో పడుతారు. ఇంతలో బిజినెస్ కోసం ఓ వ్యక్తి దగ్గర అప్పు చేసి అజయ్ అతని నుంచి తప్పించుకు తిరుగుతుంటాడు. దాంతో అతను అజయ్ ప్రియురాలిని బంధించి.. తన అప్పు రూ.10లక్షలను చెల్లించి తన ప్రియురాలిని విడిపించుకుని తీసుకెళ్లాలని షరతు పెడతాడు. మరి అజయ్ తన అప్పును చెల్లించి.. తన ప్రియురాలిని విడిపించుకున్నాడా? అప్పును తీర్చడానికి అజయ్ ఎంచుకున్న మార్గం ఏమిటి? ఈ క్రమంలో అతనికి ఎదురైన అవాంతరాలు… దాని పర్యావసానాలు ఏంటనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

 కథనం విశ్లేషణ:

ఇలాంటి కథలను బిగ్ స్క్రీన్ పై చూపించేటప్పుడు… స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. దాన్ని ఎంత ఆసక్తికరంగా మలుపులతో చూపించగలిగితే… ప్రేక్షకులు అంతగా బాగా రెండు గంటల పాటు.. థ్రిల్ కు గురవుతూ ఎంజాయ్ చేస్తారు. ఇందులో దర్శకుడు రామకృష్ణ అదే చేశారు. ఓ వైపు తన చెల్లి ఆరోగ్యాన్ని… మరోవైపు విలన్ చేతిలో బంధీ అయిన ప్రియురాలిని రక్షించుకునే క్రమంలో కథానాయకుడు ఎలాంటి రిస్క్ ను చేసి.. సక్సెస్ అయ్యాడనే దాన్ని యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరమీద చూపించారు. ముఖ్యంగా వైజాగ్ నుంచి చుట్టు పక్కల నగరాలకు గంజాయి ఎలా సరఫరా అవుతోంది… అందులో నిరుద్యోగ యువత ఎలా చిక్కుకొని.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటోంది.అనేదాన్ని దర్శకుడు బాగా స్టడీ చేసి చూపించారు. అందుకు వ్యవస్థలోని ముఖ్యమైన వ్యక్తులు కూడా ఎాలా ఇన్ వాల్వ్ అవుతున్నారనే లోపాలను కూడా ఎత్తి చూపించారు. ఆద్యంతం ఉత్కంఠను రేపే ఈ న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘పరుగెత్తు పరుగెత్తు’ మూవీ తెలుగు ఆడియన్స్ ను బోరింగ్ లేకుండా థియేటర్లో కూర్చోబెట్టడం లో ఈ చిత్రం ఓ మేరకు సక్సెస్ అయ్యింది

హీరో, హీరోయిన్ లు ఇద్దరూ బాగా నటించారు. గ్లామ్, కమర్షియల్ ఎలిమెంట్స్ కి తక్కువ స్కోప్ వున్న ఇలాంటి ఎంగేజింగ్ క్రైం థ్రిల్లర్ మూవీస్ లో స్టార్ కాస్ట్ తో పనిలేదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. కేవలం కథ.. కథనం తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ఇలాంటి చిత్రాల్లో నటీనటులు పోటీ పడి నటించి మెప్పించారు. విలన్ పాత్రధారులు, చివర్లో వచ్చే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తదితరులంతా పోటీ పడి నటించారు. ప్రేక్షకులను మరీ సీరియస్ కథ.. కథనాలతో కట్టి పడేయకుండా వుండేందుకు మధ్యలో ఓ మంచి ఐటెం సాంగును కూడా ప్లాన్ చేసి ఆడియన్స్ ని రంజింపజేశారు.
దర్శకుడు రాసుకున్న ప్లాట్.. దానిి తగ్గట్టు గ్రిప్పింగ్ స్క్ర్ న్ ప్లే రాసుకుని మెప్పించాడు. రెండు గంటల పాటు ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ ఫీల్ అవ్వకుండా చిత్రాన్ని తెరమీాదకు ఎక్కించారు. ఇక ఈ చిత్రం లో డైలాగ్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దాదాపు అన్ని డైలాగ్స్ బాగున్నప్పటికి ” పరిగెత్తే వాడి మీదే పది టన్నుల భారం దేవుడు వేస్తాడు. ……” రెండు నాలుకల మధ్య , రెండు తొడల మధ్య ఉండే వాటిని చాల పవిత్రంగా ఉంచుకోవాలి. అంటూ సాగే డైలాగ్స్ ఎంతో రియలిస్టిక్ గా , ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి.  ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. సునీల్ కశ్యప్ ఇందులో బాగా స్కోర్ చేశారు. ఐటం సాంగ్ బాగుంది  సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. నిర్మాత యామినీ కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. క్రైం థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వాచ్ చేయచ్చు. 

Leave a comment

error: Content is protected !!