డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యారు అంటారు.. కానీ ఐఏఎస్‌ కాబోయి హీరో అయిన వాళ్లు తక్కువ మంది ఉంటారు. అలాంటి వాడే హీరో యోగీశ్వర్‌. నూనూగు మీసాల కుర్రాడు యోగీశ్వర్‌ పరారీ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు జెవివి గిరి ప్రొడ్యూసర్. వీరి అబ్బాయే ఈ సినిమా హీరో యోగీశ్వర్‌. తండ్రి ప్రొడ్యూసర్ కాబట్టి కొడుకు హీరో కావడం పెద్ద కష్టమేం కాదు.. కానీ బ్యాక్‌గ్రౌండ్‌ సినీ ఎంట్రీకి ప్లాట్‌ఫామ్‌ క్రియేట్ చేసుకోవచ్చేమో కానీ.. దమ్మున్న హీరో ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవడం అంత ఈజీకాదు. కానీ పరారీ మూవీ టీజర్ చూసిన వారికి యోగీశ్వర్‌కి హీరోగా నిలబడే సత్తా ఉందని గుర్తించడం ఖాయం. ఈ సినిమా పోస్టర్‌తో పాటు మూవీ సెకండ్‌ టీజర్‌ కూడా రిలీజ్‌ అయ్యింది. ఫిలిం చాంబర్‌ అధ్యక్షులు బసిరెడ్డి పోస్టర్‌ను లాంచ్‌ చేయగా.. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు దామోదర ప్రసాద్‌ సెకండ్‌ టీజర్‌ను లాంచ్‌ చేసారు.

శ్రీ శంకర ఆర్ట్స్‌ బ్యానర్‌లో గాలి ప్రత్యూష ప్రజెంట్స్‌ ‘పరారీ’ మూవీలో యోగీశ్వర్‌కు జంటవగా అతిధి నటిస్తోంది. సాయి శివాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీనియర్‌ హీరో సుమన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవానికి ప్రొడ్యూసర్‌ జెవివి గిరి హీరో సుమన్‌కు వీరాభిమాని. సుమన్ 100 వ సినిమా జెవివి గిరి గారే నిర్మించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కుదరలేదు.. అయితే కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న పరారీ మూవీలో సుమన్‌ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. టీజర్‌ లాంచ్‌ చేసిన ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు దామోదర ప్రసాద్‌కు ఈ చిత్ర నిర్మాత జెవివి గిరి కి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా గురించి రెండేళ్ల క్రితమే దామోదర ప్రసాద్‌తో చర్చించినా… తన కొడుకే హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పలేదట. టీజర్‌ చూసిన దామోదర ప్రసాద్‌.. యోగీశ్వర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

అలీ షయాజి షిండే, మకరంద్ దేశ ముఖ్ కీలక పాత్రల్లో నటించారు. దివంగత సంగీత దర్శకుడు చక్రి తమ్ముడు మహిత్‌ నారాయణ్‌ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్న అందించారు. మంచి కథ కథనాలతో తెరకెక్కిన పరారీ అందరిని మెప్పిస్తుందని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కథ కథనాలతో పాటు అద్భుతమైన టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ‘పరారీ’ మూవీ ఈ నెల 30న సినిమా రిలీజ్ కాబోతుంది.
యోగేశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం మహిత్ నారాయణ్, లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్, యాక్షన్ :నందు, కొరియోగ్రఫీ: జానీ, భాను, నిర్మాత: జి వి వి గిరి, దర్శకత్వం: సాయి శివాజీ

Leave a comment

error: Content is protected !!