పరారీ ‘ రన్ ఫర్ ఫన్.. ఈ ట్యాగ్‌లోనే సినిమా ఫ్లేవర్ అర్ధమవుతుంది. యూత్ టార్గెట్‌గా.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పరారీ మూవీకి విపరీతమైన ప్రచారం జరిగింది. కొత్త కుర్రాడైనా మేకింగ్ వేల్యూస్, విజువల్ క్వాలిటీ కి ఏమాత్రం వెనుకాడకుండా తీసిన సినిమా పరారీ. ఇదంతా టీజర్ ట్రైలర్, సాంగ్స్ రిలీజ్‌లతో జరిగిన హైప్. మరి ఈ హైప్‌కు తగ్గట్టే సినిమా ఉందా..? సాయి శివాజీ డైరెక్షన్‌లో జివివి గిరి నిర్మాణంలో యోగీశ్వర్, అతిధి జంటగా మార్చి 30 న రిలీజ్ అయిన పరారీ ఎలా ఉంది.. హిట్టా ఫట్టా.. ? ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
యోగి,అతిధి కాలేజ్ మేట్స్. ఇద్దరూ ప్రేమలో పడతారు. జబర్ధస్త్ రఘు, భూపాల్ లు హీరో యోగి స్నేహితులు. భూపాల్‌కి లవర్ శివాని సైని. వీరంతా ఓ మర్డర్ కేస్‌లో ఇరుక్కుంటారు. యోగి తండ్రి (షాయాజీ షిండే) క్షణం తీరిక లేని బిజినెస్ మేన్. ఇతన్ని పాండే (మకరంద్ దేశ్ పాండే) కిడ్నాప్ చేస్తాడు. ఓ వైపు మర్డర్ మిస్టర్, మరోవైపు తండ్రి కిడ్నాప్. ఇంకోవైపు అతిధి తో ప్రేమ వ్యవహారం. ఇన్నింటి మధ్య యోగి రన్ ఈ సినిమా జర్నీ. యోగి ఈ సమస్యలను ఎలా ఛేదంచి లవ్‌లో సక్సెస్ అయ్యాడనేది ఈ చిత్ర కథాంశం.
కథనం :
ఆడియెన్స్‌ని రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టే సత్తా క్రైమ్ థ్రిల్లర్స్ కు ఉంది.. ఆద్యంతం అలరించేది కామెడీ.. ఈ రెండింటినీ మిక్స్ చేస్తే మినిమమ్ గ్యారెంటీ హిట్ సినిమా తయారవుతుంది. కానీ స్క్రీన్ ప్లే పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ కావాలి…టైమింగ్‌లో కామెడీ పండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ తన పనితనం చూపాలి. అప్పుడే కాస్టింగ్ కొత్తవారైనా సినిమా హిట్ పక్కా అవుతుంది. సరిగ్గా అలాంటి సినిమానే పరారీ.
హీరో యోగీశ్వర్‌కు ఇది ఫస్ట్ సినిమా. కానీ ఎక్కడా తొణుకు బెణుకు, బెరుకు లేకుండా నటించాడు. డైలాగ్ డెలివరీ నుంచి డాన్స్ ఫైట్స్ వరకు యోగీశ్వర్ ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. కామెడీ పార్ట్ వరకు మేగ్జిమమ్ క్రెడిట్ జబర్దస్త్ రఘు కే ఇచ్చేయాలి. అంతబాగా కామెడీ పర్‌ఫార్మ్ చేసాడు. హీరో ఫ్రెండ్ భూపాల్ పర్లేదనిపించాడు. అతని జోడీ శివాని సైని గ్లామర్‌లుక్‌లో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ టైమ్‌లో టీమ్ ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ ప్రమోట్ చేసిన అంశం సీనియర్ హీరో సుమన్. ఈ చిత్ర నిర్మాత సుమన్ వీరాభిమాని. ఆయనతో సినిమా చేయలేకపోయినా.. ఇప్పుడు తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషించడం వారి అదృష్టంగా చెప్పుకున్నారు. అందుకు తగ్గ ఇంపార్టెన్స్ ఉన్న రోలే చేసాడు సుమన్. పోలీసాఫీసర్ పాత్రలో హీరో సుమన్ అదరగొట్టాడు. అలాగే గయ్యాళి పాత్రలో హీరోయిన్ తల్లి క్యారెక్టర్ చేసిన నటికి మంచి మార్కులు పడతాయి. ఇక మకరంద్ దేశ్‌పాండే విలన్‌గా బాగా తెలిసినవాడే. అయితే ఇందులో విలనీలోనే కామెడీ అద్భుతంగా పండించడం విశేషం.
ఈ మూవీకి రన్ ఫర్ ఫన్ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. స్క్రీన్ మీద హీరో బ్యాచ్ రన్ చేస్తుంటే ఆడియెన్స్ ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా స్టార్టయిన దగ్గర్నుంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. సెకండాఫ్ లో మర్డర్ మిస్టరీని గ్రిప్పింగ్ స్క్రీన్‌ఫ్లే బాగా నడిపించాడు దర్శకుడు సాయి శివాజీ. థ్రిల్లింగ్ క్రైమ్ సీన్స్ కి తగ్గట్టుగానే కామెడీని కూడా బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సాయి శివాజీ పనితనం తెలుస్తుంది. అత్తాపురం బోల్డ్ కామెడీ అయినా,ఐటమ్ సాంగ్స్ అయినా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. యాక్షన్ తో కామెడీ పండించడం విశేషం. మకరంద్ దేశ్‌పాండే బ్యాచ్‌తో ఈ యాక్షన్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యంది.
గరుడ వేగా అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ గా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. ఒకస్టార్ హీరో సాంగ్స్ ఎలా ఉంటాయో ఖర్చుకు వెనుకాడకుండా అలా తీశారు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాని తీశారు నిర్మాత జి.వి.వి.గిరి. గో అండ్ వాచ్ ఇట్.
బాటమ్ లైన్ : ‘పరారీ’ ఫన్ రైడ్
రేటింగ్: 3