చిత్రం: పంచతంత్రం
నటి నటులు: సముధ్రఖని, బ్రమ్మానందం, ఆదర్శ్, కలర్ స్వాతి, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, ఉత్తేజ్ తదితరులు…
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: రాజ్ నల్లి
ఎడిటర్: గ్యారీ బి హెచ్
నిర్మాత: అఖిలేష్ వర్ధన్, సృజన ఎర్రబోలు
డైలాగ్స్: సందీప్ రాజ్, హర్ష పులిపాక
రచన, దర్శకత్వం: హర్ష పులిపాక
విడుదల తేదీ: 09-12-22
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య తదితరులు నటిస్తోన్న యాంథాలజీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ రష్మిక చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటికే, విజ్యువల్స్ & ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకోగా, గ్రాండ్ గా ఈ వారం విడుదలైన ఈ చిత్రం కథ ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథ: వేదవ్యాస్(బ్రమ్మానందం) ఒక రిటైర్డ్ ఆఫీసర్. కానీ, రైటర్ గా ఎదగాలని కళలు కంటాడు. ఆ కళల్ని నెరవేర్చుకునే పనిలో ఉండగా, కూతురు రోషిని(కలర్ స్వాతి) ఏజ్ ని గుర్తు చేస్తూ తండ్రి కి అడ్డు చెప్తుంది. కూతురు మాట పట్టించుకోకుండా, టాలెంట్ కి ఏజ్ మ్యాటర్ కాదు అంటూ తన కళని ఎలా సాధించాడు అనేది కథ. రైటర్ గా ఆడిషన్ కి వెళ్లిన బ్రమ్మానందం సైట్, టెస్ట్, స్మెల్, సౌండ్, టచ్ అనే 5 పంచేద్రియాలు కథను స్టార్ట్ చేస్తాడు. మరి, ఆ 5 కథలు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయో లేదో విశ్లేషణ లోకి వెళ్ళిపోదాం?
కధనం,విశ్లేషణ:
‘పంచతంత్రం’ మూవీ 5 జంటలకు సంబంధించిన కథ. బ్రహ్మానందం ఈ 5 కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి, తన కోణంలో కథను స్టార్ట్ చేస్తాడు. జీవితంలో సంతోషాలు, బాధలు ఇలా ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది ఈ యాంథాలజీ కాన్సెప్ట్.
సినిమాలో మనకు కనిపించబోయే 5 జంటలకు ఒక్కో కథ, ఒక్కో రకమైన ప్రయాణం. అవన్నీ, ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనేది ‘పంచతంత్రం’ లో ఎమోషనల్ గా చూపించారు. కొన్ని సంవత్సరాలు తరువాత కామిడి దిగ్గజం బ్రమ్మానందం గారు పంచతంత్రం మూవీ లో ముఖ్య పాత్ర పోషించారు. అంతే కాదు, ఎంతో సెట్టిల్డ్ గా నటిస్తూనే కథ ని ముందుకి తీసుకెళ్లడం బహుశ ఆ క్యారెక్టర్ లో మరెవ్వరిని ఉహించుకోలేనంతగా పెర్ఫామ్ చేసారు…!! రోషిని(కలర్ స్వాతి) – వేదవ్యాస్(బ్రమ్మానందం) కాంబినేషన్ లో వచ్చే ప్రతి సీన్ చాలా కూల్ ఉంటుంది. అలాగే డాటర్ & ఫాదర్ రిలేషన్ షిప్ బాండింగ్ అండ్ న్యాచురాలిటీ కనిపిస్తుంటుంది.
మొదటి స్టోరీ(సైట్): విహారి(నరేష్ అగస్త్య) సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా పని చేస్తూ, వర్క్ ని ఎంతో ప్రెజర్ గా ఫీల్ అవ్వుతూ ఇబ్బంది పడే క్యారెక్టర్. ఆ ప్రెజర్ ని ఓవర్ కమ్ చేసి, ఎలా ముందుకి వెళ్ళాడు అనేది మొదటి స్టోరీ కథ. ఈ స్టోరీ లో చాలా మందికి విహారి క్యారెక్టర్ చాలా సిల్లీ గా అనిపించిన క్యారెక్టర్ లో ఉండే ఇన్నోసెన్స్, ప్యూరీటి ని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాయి. కాకపోతే, ఈ ఎపిసోడ్ లో విజ్యువల్స్ అంతగా ఆకట్టుకోవు.
సెకండ్ స్టోరీ(టేస్ట్): ప్రతి అమ్మాయి, అబ్బాయి కి తమకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచులు పెళ్లి దాకా తీసుకువస్తాయి, కానీ పెళ్లి కి ముందు చాలా అపోహలు ఉంటాయి. ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళికి ఓకే చేసినప్పుడు అది పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎలా చెప్పగలం? అసలు ఒక అమ్మాయి, అబ్బాయికి ఉండాలిసింది ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గా చూపిస్తారు. ఈ స్టోరీ ని ప్రతి ఒక్కరు ఎంత గానో ఇష్టపడతారు. ఈ స్టోరీ లో లేఖ(శివాత్మిక రాజశేఖర్) స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అండ్ తెలియకుండ లేఖ మాయలో పడిపోతారు. సుభాష్ (రాహుల్ విజయ్) కూడ చాలా సెటిల్డ్ గా చేసాడు.
థర్డ్ స్టోరీ(స్మెల్): కష్టం వచ్చినప్పుడు తుంచుకోవడం కాదు, పంచుకోవడం అనే డైలాగ్ సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఈ స్టోరీ లో సముధ్రఖని ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, ఇంట్లో కాళీ సమయాన్ని గడుపుతుంటాడు. సడెన్ గా ఒక వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి తో అందరిని భయభ్రాంతుల్ని చేస్తాడు. ఆ వ్యాధి ని ఎలా ఓవర్ కమ్ చేసి బయట పడ్డాడు అనేది ఈ స్టోరీ. సముద్రఖని పెర్ఫామెన్స్ పీక్స్ అసలు. చూసాక మీరు భయపడాలిసిందే, కాకపోతే కొంచెం సాగదీత గా అనిపిస్తుంది. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది.
ఫోర్త్ స్టోరీ(సౌండ్): ఈ స్టోరీ లో దివ్య శ్రీపాద, వికాస్ ఇద్దరు అన్యోన్య దంపతులు గా చూడముచ్చటగా కనిపిస్తారు. కాకపోతే, ఒక విషయంలో వాళ్ళ ఇద్దరి జీవితాన్ని కలవర పెడుతుంటుంది. ఎన్ని ఆటు పోట్లు, ఇబ్బందులు ఎదురైన దంపతులు గా కలిసి కష్టాల్ని ఎలా అధిగమించారు అనేది ఈ స్టోరీ యొక్క నీతి. ప్రతి ఒక్కరు ఈ స్టోరీ కి కనెక్ట్ కావలిసిందే, కొన్ని సీన్స్ అయ్యితే ఎక్సలెంట్ గా తీర్చిదిద్దారు. పైగా దివ్య శ్రీపాద పెర్ఫామెన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అని చెప్పచ్చు.
ఫిఫ్త్ స్టోరీ(టచ్): లియా(కలర్ స్వాతి) ఒక ఎంట్రప్రినర్. ప్రతి రోజు పాడ్ కాస్టింగ్ లో లియా స్టోరీస్ చెప్తుంటుంది. ఆ పాడ్ కాస్ట్ విని లియా ని ఎంతగానో అభిమానించే చిన్నారులు ఉంటారు. ఆ క్రమంలో పాడ్ కాస్టింగ్ ప్రోగ్రామ్ ఎండ్ చేసి, నెస్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, రూపా అనే చిన్నారి వల్ల, ఆ పాడ్ కాస్టింగ్ కి మరింత వెయ్యి రేట్లు ప్రాణం పోస్తుంది. అసలు ఆ చిన్నారి ఎవ్వరు? ఏం చేసింది? ఆ పాప ప్రాముఖ్యత ఏంటి? అనేది మీరు ఖచ్చితంగా సినిమాలో చుడాలిసిందే. ఎందుకంటే, ఈ స్టోరీ చూసాక సగటు ప్రేక్షకుడు భావోద్వేగానికి లోనవ్వుతారు. ప్రతి ఒక్కరి హార్ట్ కి టచ్ అవ్వుతుంది. క్లైమాక్స్ ఫినిషింగ్ అదిరిపోతుంది. ఈ స్టోరీ ద్వారా సెకండ్ షెడ్ లో కనిపించిన కలర్ స్వాతి అవలీల గా యాక్ట్ చేస్తూ ప్రేక్షకులని ఎమోషనలోకి తీసుకెళ్తుంది.
నటి నటులు పెర్ఫామెన్స్: ముఖ్య పాత్ర పోషించిన కామిడి దిగ్గజ నటుడు బ్రమ్మానందం నటన అమోఘం అనే చెప్పాలి. ఈ సినిమా కి అయ్యన ప్రెజెన్స్ ఎంతో కీలకం. ప్రతి క్యారెక్టర్ ని రివీల్ చేసే విధానం, బ్రమ్మానందం యాక్ట్ చేసిన తీరు బాగా ఆకట్టుకుంటాయి. శివాత్మిక రాజశేఖర్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఇకపోతే దివ్య శ్రీపాద ప్రెగ్నెన్సీ లేడి గా సగటు ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది. అదే విధంగా కలర్ స్వాతి చేసిన 2 షేడ్స్ ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యిపోతారు. ప్రత్యేకంగా సముధ్రఖని క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్. నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, శ్రీ విద్య, ఉత్తేజ్, ఆదర్శ్ తదితరులు తమ పరిధి మేరకు బాగానే రాణించారు.
సాంకేతిక వర్గం: దర్శకుడు హర్ష పులిపాక పంచేద్రియాలు అనే పేరు పెట్టి, 5 జంటల కథ చెప్పిన తీరు అద్భుతం. కాకపోతే, సినిమాలో అక్కడక్కడ సాగదీత గా ఉన్నాయి. ఎడిటర్ గ్యారీ బి హెచ్ ఎంతో నైపుణ్యం తో ఎడిట్ చేసిన, ఇంకాస్త కట్ చేసుంటే మ్యాస్టర్ పీస్ అయ్యుండేది ఏమో. రాజ్ నల్లి డీఓపీ విజ్యువల్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉండాలిసింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో విజ్యువల్స్ తేలిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి అద్భుతంగా రాణించారు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: సోల్ ఉన్న “పంచతంత్రం” ఫిల్మ్
Review By: Tirumalasetty Venkatesh