నటి నటులు: గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: కర్మ్ చావ్లా
ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్
నిర్మాత: బన్నీ వాస్, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: జులై 01, 2022
మ్యాచో స్టార్ గోపీచంద్ మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. టైటిల్ తో ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవడమే కాకుండా టీజర్స్, ట్రైలర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే, టిక్కెట్ల ధరల విషయంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకొని తెలంగాణలో సింగిల్ థియేటర్‌లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.160గా ప్రకటించారు. ఆంధ్రలో అయ్యితే సింగిల్ థియేటర్‌లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.150గా చేసారు. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువు ధరకి సినిమా టికెట్ దొరకడం విశేషం. జూలై 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం?
కథ: సూర్య నారాయణ (సత్యరాజ్) నిజాయితీ పరుడు పేరు ప్రఖ్యాతలు కలిగిన ఒక జడ్జ్. ఒక అమ్మాయి సెన్సిటివ్ కేస్ విషయంలో తప్పుడు తీర్పు ఇవ్వడం కారణం గా, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేస్తాడు. కొన్ని దశాబ్దాల తరువాత సూర్య నారాయణ కొడుకు రాంచంద్ (గోపీచంద్) డబ్బుకోసం ఎలాంటి పనైనా చేసే అత్యాశ గల ఒక లాయర్. ఒక కేస్ విషయంలో గోపీచంద్ క్రిమినల్ రాజకీయ నాయకుడు (రావు రమేష్) తో చేతులు కలుపుతారు. అది చుసిన గోపీచంద్ తండ్రి (సత్యరాజ్) వాళ్ళిద్దరిని ఎదురుకోవడానికి మరల లాయర్ కోట్ దరిస్తాడు. ఈ సూర్య నారాయణ (సత్యరాజ్) గెలుస్తాడా? లేదా? ఆ తండ్రీకొడుకుల పోరు లో ఎవరు గెలిచారు అనేది సినిమా కథ. మరింత కధ తెలుసుకోవాలి అంటే థియేటర్ లో చూడాల్సిందే ?
కధనం,విశ్లేషణ: డైరెక్టర్ మారుతి ఎంతో ప్రాక్టికల్ గా చాలా సహజంగా మాట్లాడే మనిషి, అతన్ని దగ్గర నుండి గమనిస్తే మీకే తెలుస్తుంది. బహుశా ఈ కథ అలాగే పుట్టి ఉండచ్చు. మారుతీ ఎప్పుడు ఏదోకటి జనాలకి కొత్తదనం, ఫన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. మరి ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం ఉందో తెలుసుకుందాం.
జిల్ మూవీ తరువాత మల్లి ఆ రేంజ్ హీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ తో అదరకొట్టాడు. బ్యూటిఫుల్ రాశీ ఖన్నా క్యారెక్టరైజేషన్ అయ్యితే టెర్రిఫిక్ ఉంటది. రాశీ ఖన్నా స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఎంతో ఛార్మింగ్ సినిమా సాగుతుంటుంది. ప్రత్యేకంగా, రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ అన్ని రకాల ఎమోషన్స్ పండిస్తూ, అయ్యనతో పాటు వచ్చే అజయ్ గోషాల్ సన్నివేశాలు మరో లేవెల్ లో ఉంటాయి. సత్యరాజ్ ఎప్పటి లాగే తన నటనతో మెరిపిస్తాడు. నేనింతే సినిమా తరువాత మల్లి మెరిసిన సీయా గౌతమ్ ముఖ్య పాత్రలో పోషించి మెప్పించింది. తండ్రి కొడుకుల మధ్య జరిగే పోటా పోటీ సీన్స్, రాశీ ఖన్నా ఇంటర్డక్షన్, క్లైమాక్స్ లో ముఖ్యమైన సన్నివేశాలు, వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీ అదిరిపోతుంది.
డైరెక్టర్ మారుతి సినిమాలో నటించిన ప్రతి ఆరిస్ట్ ల క్యారెక్టరైజేషన్ బాగా తీర్చిదిద్దారు. కానీ అవ్వి రొటీన్ సన్నివేశాలు కావడం కొంచెం నిరాశపరిచిన సినిమా మొత్తం కడుపుబ్బా నవ్విస్తాడు. సినిమాలో సాంగ్స్ విజ్యువల్స్ బాగున్నప్పటికీ పాడుకోదగ్గ సాంగ్స్ లేకపోవడం మైనస్. అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ సీన్స్ ఇంపాక్ట్ లెకపొయ్యినప్పటికీ పర్వాలేదు అనిపించాయి.
నటి నటుల పెర్ఫామెన్స్: గోపీచంద్ మునపటి లాగే యంగ్ & ఎనర్జిటిక్ గా కనిపిస్తూ సినిమాలో విలన్ అనిపిస్తునే హీరో గా రఫ్ఫాడిస్తారు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో దర్శకులు రాశీ ఖన్నా కి నాణ్యత ఉన్న క్యారెక్టరైజేషన్ ఇవ్వటం, అవ్వి వినియోగించుకొని నెస్ట్ లెవెల్ కి వెళ్ళటం ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీ లో రావు రమేష్ ఉండటం నిజంగానే గొప్ప వరం. రావు రమేష్ యాక్టింగ్ చేసిన తీరు చూస్తే ఇస్తారుకులో ఫుల్ మీల్స్ తిన్నత హాయిగా ఉంటుంది. సత్యరాజ్ తన పరిధి మేరకు బాగా రాణించారు. శ్రీనివాస్ రెడ్డి ఉన్నంత వరుకు కడుపుబ్బా నవ్విస్తాడు.
సాంకేతిక వర్గం: దర్శకుడు మారుతీ మళ్ళి తన మార్క్ స్క్రీన్ మీద కనబరిచేలా చేసాడు. అక్కడక్కడ రొటీన్ సన్నివేశాలు చూపించి బోర్ కొట్టినప్పటికీ సినిమా లో తన డైలాగ్స్, క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ తో బాగా సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ డైరెక్టర్ బిజెఎం బాగానే ఇచ్చిన, సాంగ్స్ పాడుకునే విధంగా ట్యూన్స్ ఇచ్చివుంటే నెస్ట్ లెవెల్ ఉండేది. గ్రాండియర్ గా ప్రొడక్షన్ వాల్యూస్ మైంటైన్ చేస్తూ సినిమాటోగ్రఫీ బాగా చేసారు. ఎడిటర్ పని తీరు బాగుంది.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: పక్కా కామెడి