Tollywood : విజయ్ శంకర్, విషిక జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ “పాగల్ వర్సెస్ కాదల్”. ఈ మూవీలో విజయ్ శంకర్ కార్తీక్ అనే ఇన్నోసెంట్ యువకుడిగా, విషిక ప్రియ అనే అనుమానించే యువతిగా కనిపించనున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ, “పాగల్ వర్సెస్ కాదల్ ప్రేమలో ఉన్న ప్రతి జంటకు సంబంధించిన కథ. కార్తీక్ ఇన్నోసెంట్ అబ్బాయి. తన ప్రేయసి ప్రియతో ఇబ్బందులు పడుతుంటాడు. పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది.విషిక ఈ సినిమాలో అద్భుతంగా నటించింది.” అని అన్నారు.

విషిక మాట్లాడుతూ.. “ప్రియ అనే పాత్ర నాకు కొత్త అనుభవం. ఈ సినిమాలో నేను బాయ్‌ఫ్రెండ్‌ను ఎలా ఇబ్బంది పెడుతున్నానో చూసి అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇంతలా ఇబ్బంది పెట్టరు అని అనుకుంటారు. నా కెరీర్‌లో ఇది మర్చిలేని సందర్భం.” అని అన్నారు.

Leave a comment

error: Content is protected !!