విశ్వ‌క్ సేన్ మొదటి సినిమా ‘ఫలక్ నామ దాస్’ తో తాను మాస్ కా దాస్ అంటూ ప్రేక్షకులను మెప్పించాడు. తర్వాత నాని సమర్పణలో వచ్చిన ‘హిట్’ చిత్రం కూడా మంచి విజయం సొంతం చేసుకుంది. తాజాగా దిల్ రాజు సమర్పణలో రానున్న ‘పాగల్’ తో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హాట్రిక్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నాడు.

‘పాగల్’ లో సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ తో విశ్వక్ సేన్ ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. పోస్టర్ లో నివేదా క్యారెక్ట‌ర్ పేరు ‘తీరా’ గా ప‌రిచ‌యం చేసింది. మేక‌ర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో విశ్వ‌క్‌సేన్ త‌న రెండు చేతులు వెన‌క్కి క‌ట్టేసి వుండే టీష‌ర్ట్‌, ఫ్రాక్ ధ‌రించి అత‌న్ని హ‌గ్ చేసుకుంటున్న నివేదా క‌నిపిస్తోంది. పోస్టర్ లో మొత్తానికి నివేదా పాగల్ ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తుంది. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా బ్యాన‌ర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీని మే 1న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!