తారాగణం : నరేన్ వనపర్తి, దీపాలి శర్మ, రామరాజు, ఆనంద చక్రపాణి, అంకిత్  కొయ్య, జబర్దస్త్  ఫణి , జగదీశ్, రూప లక్ష్మి, లావణ్య రెడ్డి, ప్రేమ్ సాగర్.
సినిమాటోగ్రఫీ :శ్రీకాంత్ అరుపుల

Banner : ఈగల్ ఐ ఎంటర్ టయిన్మెంట్స్
మ్యూజిక్ :భీమ్స్
సాహిత్యం :సురేష్ గంగుల, పూర్ణ చారి
ఎడిటింగ్ :శివ శర్వాని
స్టోరీ -స్క్రీన్ ప్లే -డైలాగ్స్ :ఉదయ్ మరియు నాగమణి రాజు
కోప్రొడ్యూసర్ :హుస్సేన్ నాయక్
లైన్ ప్రొడ్యూసర్స్  :నవీన్ చందా, త్రిలోక్ నాధ్ గడ్ల
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ :మాల్యా కందుకూరి
ప్రొడ్యూసర్ :వనపర్తి వెంకట రత్నం
దర్శకత్వం :సతీష్ అండ్ టీమ్

విడుదల తేది : 19-11-2021

ఒక రైతు తన కొడుకును కలెక్టర్ ను చేయడం చూశాం…డాక్టర్ ను చేయడం చూశాం.. తన కొడుకును ప్రయోజకున్ని చేయడం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాడు రైతు కాని, తన కొడుకును సినిమా హీరోను చేయడం కోసం నిర్మాతగా మారిన ఒక సాధారణ మధ్యతరగతి రైతు ఒక సినిమానే నిర్మించే సాహసం చేశాడు… ఆ సినిమానే ‘ఊరికి ఉత్తరాన’. వరంగల్  సమీపంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథను చేస్తున్నట్టు టెక్స్ట్ వేసి, ఈ చిత్రం పట్ల ఆసక్తిని పెంచారు. చిత్ర బృందం.. కథా కథనం, సంభాషణలతో  పాటు నటీ, నటులు, సాంకేతిక విభాగం పనితనం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ : వరంగల్ జిల్లా పర్వతగిరి అనే ఊరి పెద్ద శంకర్ పటేల్ (రామరాజు). ఆయన మాటకు కట్టుబడి, ఆయన చెప్పిందే వేదంగా నడుచుకుంటారు ఆ ఊరి ప్రజలు.. పేగు బంధం తో ఏర్పడిన తల్లిదండ్రుల ప్రేమే నిజమైన ప్రేమ. అంతకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు అని నమ్మే శంకర్ పటేల్ (రామరాజు) తను ఎంతో మమకారంగా చూసుకున్న కూతురు, పెళ్లి వేడుక మధ్యలోనే, ప్రేమించిన యువకునితో పారిపోతుంటే, తట్టుకోలేక వెతికి పట్టుకొచ్చి, తన ఊరిలో కాకతీయ కళా తోరనానికి వ్రేలాడదీసి, తన ఊరు వాళ్లకు ఓ అవకాశామిస్తాడు. తన కూతురు ప్రేమ గొప్పదీ అనేవాళ్ళు ఆ యువకుణ్ని కాపాడవచ్చు. లేదా తల్లిదండ్రుల ప్రేమే గొప్పది అనుకుంటే ఆ యువకుణ్ని  ఉట్టిని కొట్టినట్టు కొట్టి చంపేయోచ్చు. దానికి తన కూతురు మినహా ఏ ఒక్క గ్రామస్తుడూ ఆ యువకుణ్ని కాపాడే ప్రయత్నం చేయలేదు… ప్రతిఫలంగా తన కూతురు ప్రేమించిన వాడితో పాటు తన కూతురినీ పోగొట్టుకున్నాడు శంకర్ పటేల్.. ఆ బాధను భరించలేక పోతుంటాడు.. ఈ క్రమంలో తన మేన కోడలు శైలు (దీపాలి) లో తన కూతుర్ని చూసుకుని, ఉపశమనం పొందుతుంటాడు. అదే ఊరిలో నివసిస్తూ మైలారం అనే గ్రామంలో కరెంట్ ఆఫీస్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న కరెంటు నారాయణ (ఆనంద చక్రపాణి) కొడుకే కరెంటు రాజు (వనపర్తి నరేన్) అమాయకుడు. తల్లి చనిపోయిన బాధలో, చదువు మధ్యలోనే ఆపేసి బలాదూర్ తిరుగుతుంటాడు. పెళ్లి చేస్తేనైనా బాగు పడతాడని తన తండ్రి, తన ఇద్దరు స్నేహితులు ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాదు, ఈ క్రమంలో ఒకరోజు గుళ్ళో శైలుని చూసి, ప్రేమలో పడతాడు రాజు. ఈ ఏజ్ బార్ రాజును, ఆ టీనేజ్ శైలు ప్రేమిస్తుందా..? ఒకవేళ శైలు ప్రేమిస్తే శంకర్ పటేల్ ఊరికే ఉంటాడా? వారి ఊరి కట్టుబాటు ప్రకారం ప్రేమించిన యువకుణ్ని ఉట్టిని కొట్టినట్టు కొట్టి చంపేస్తారు కదా.. అదీ స్వయానా శంకర్ పటేల్ మేన కోడలునే ప్రేమించాడు. ఈ అమాయక రాజు గాడు తన ప్రాణాలే పోగొట్టుకుంటాడా? లేక ఆ ఊరినే మారుస్తాడా? తదితర ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రం.

 

కథనం :  మొదటి సన్నివేశంలో శంకర్ పటేల్ విధించిన శిక్షే.. ఈ సినిమాలో కీలక సన్నివేశం… అదే ప్రేక్షకుణ్ని కట్టిపడేసే లాక్ పాయింటు. దాంతో కరెంటు రాజు, శైలు ప్రేమ గెలుస్తుందా? ఓడిపోతుందా? గెలిస్తే ఎలా గెలుస్తుంది? లేదా, చనిపోతారు కదా? అనే కుతూహలం ప్రేక్షకుడికి కలిగించేలా బాగా చిత్రికరించారు. తర్వాత పెళ్లి కోసం యువకులు పడే పాట్లు, యువతుల డిమాండ్లు స్నేహితులు హెల్ప్ చేస్తూ, హేళన చేయడం లాంటి సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. కరెంట్ రాజు స్నేహితులుగా జబర్దస్త్ ఫణి, జగదీశ్ ప్రతాప్ లు ఆద్యంతం నవ్వించారు.. ఇక కరెంట్ రాజు క్లాస్మేట్స్ ప్రిన్స్పాల్, లెక్చరర్ స్థాయిలో ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాజు తన ఆగిన డిప్లమా చదువును కొనసాగించడానికి రీ అడ్మిషన్ తీసుకుని, కాలేజ్ కెళ్తే ఎంత కామిడీగా ఉంటుందో.. అదంతా ఎక్కడా తగ్గకుండా చాలా బాగా చూపించారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే  అనుబంధాన్ని చక్కగా చూపించారు. రాజు, శైలు ల మధ్య సన్నివేశాలన్నీ బాగా కుదిరాయి. విలేజ్ లో కలిగే ప్రేమ, ప్రేమించుకునే విధానం ఈ సినిమాలో సహజత్వానికి
దగ్గెరగా ఉంది… గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, సహజంగా  మాట్లాడుకునే మాటలు ఈ చిత్రంలో కుదిరాయి. ముగింపులో అటు ఊరి ప్రజలను, ఇటు శంకర్ పటేల్ ను సగటు ప్రేక్షకుల ను కన్వే చేసే విధంగా కథ, కధనాలను, సంభాషణలను సమకూర్చారు.. ఈ మధ్య కాలం లో ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ‘ఊరికి ఉతరాన’

నటీనటులు : తొలి పరిచయమే అయినా కథానాయకుడు కరెంట్ రాజు పాత్రలో వనపర్తి నరేన్ ఒదిగి పోయి నటించాడు. శైలు (దీపాలి) కథానాయకి అందం అభినయం ఈ సినిమాకు బాగా కుదిరాయి. శంకర్ పటేల్ పాత్రలో రామరాజు తన విలక్షణ  నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా కరెంట్ రాజు తండ్రి పాత్ర ఈ చిత్రానికే కీలకం సెంటిమెంట్, బాధను, దు:ఖాన్ని అవలీలగా పలికించి పాత్రకు జీవం పోశారు (ఆనంద్ చక్రపాణి). ఇక హీరో స్నేహితులుగా నటించిన జగదేశ్ ప్రతాప్, జబర్దస్త్ ఫణి ఇద్దరి కామెడి సహజంగా, కొత్తగా ఉంది. ఇతర పాత్ర దారులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు : కథ కథనాన్ని నడిపించడంలో, పాత్రా స్వభావాలను తెరకెక్కించడంలో విజయవంతమయ్యాడు దర్శకుడు సతీష్  పరమవేద… గతం లో దర్శకత్వ శాఖలో పనిజేసిన అనుభవం ‘లో’ బడ్జెట్ తో అందరూ మెచ్చే సినిమా రూపొందించడానికి ఉపయోగ పడింది. నటీ నటులను, సాంకేతిక నిపుణులను అవసరమైనంత మేరకు ఉపయోగించుకో గలిగాడు మొతానికి విజయవంతమిన చితరంగా మలచడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ చిత్ర నిర్మాత (వనపర్తి వెంకటయ్య) ఖర్చుకి వెనకాడకుండా దర్శకుడు అడిగింది లేదనకుండా ఇచ్చాడని ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చు తెలుగు చిత్రసీమకు సినిమాల పట్ల అభిరుచి ఉన్న మరో మంచి నిర్మాత దొరికాడని. భీమ్స్ సి సి రోలియో – సురేష్ బొబ్బిలి ఇద్దరూ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న సంగీత దర్శకులే అయినా ఈ సినిమాకి సంగీతం అందించి, ఈ చిత్ర విజయానికి తోడ్పడ్డారు.. సురేష్ గంగుల, పుర్నాచారి ల సాహిత్యం బాగుంది. ఈ చిత్రానికి మాటలే ప్రధాన ఆకర్షణ ఉదయ్ మరియు మణి లు సినిమాలో డైలాగ్స్ రాయలేదు మాటలు యదా తధంగా రాసి ఆకట్టుకున్నారు. వారి స్వస్థలం రాయలసీమ అయినప్పటికీ తెలంగాణలోని పర్వతగిరి ఏరియాలో యాసను పట్టుకున్నారు సహజంగా రాశారు. సినిమాటోగ్రాఫి శ్రీకాంత్ అరుపుల… మొదటి సన్నివేశం తోనే అర్ధం అవుతుంది ఆయన పనితనం.. ఎక్కడా తగ్గలేదు… దర్శకుడి విజన్ లోని ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించగలిగాడు. ఇంకా ఎడిటింగ్, మిక్సింగ్ తదితర విభాగాలన్నీ సమర్ధవంతంగా పనిచేసి, ఓ మంచి సినిమాని అందించాయి అని చెప్పొచ్చు. ఇంటిల్లిపాది థియేటర్ కెళ్ళి చూసి, మనస్పూర్తిగా నవ్వుకునే చిత్రం ‘ఊరికి ఉత్తరాన’

 

ట్యాగ్ లైన్ :  ప్యూర్లీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్ : 3.25/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!