డిఫరెంట్ చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో మరో థ్రిల్లింగ్ కథాంశంతో రాబోతున్న మూవీ ఊరిపేరు భైరవకోన“. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం సమర్పణలోహాస్య మూవీస్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 9 న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ మెయిన్‌లీడ్‌ లో రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ చిత్రంలో నిజమేలే చెప్తున్న అనే సాంగ్ మేజర్ బ్లాక్‌ బస్టర్‌ అయ్యిందనీ.. లవర్స్‌ ఈ పాటను ఒకరికొకరు డెడికేట్‌ చేసుకుంటూ సూపర్‌ హిట్ చేసారనీ.. వారంత చల్లగా ఉండాలన్నారు హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ.

ఈ చిత్రంలో రెండు పాటలు సూపర్‌ హిట్ అయ్యాయనీ.. ఈ సినిమా రోలర్‌ కోస్టర్‌ రైడ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందనీ.. దానికి నేను గ్యారెంటీ అని సినిమా హిట్ పై నమ్మకం వ్యక్తం చేసారు హీరోయిన్‌ కావ్య థాపర్.

ఈ సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డామనీగ్యారెంటీగా ధియేటర్లలో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తామని.. మీరెంత ఊహించుకుని వచ్చినా.. అంతకు రెట్టింపు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తామనీ.. నిరాశపర్చమనీగొప్ప లవ్‌స్టోరీ, సూపర్బ్‌ యాక్షన్‌, థ్రిల్లింగ్‌ విజువల్స్‌తో సినిమా తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందన్నారు నిర్మాత రాజా.

ఆడియెన్స్‌ చూసే రెండున్నర గంటల సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డామనీ.. సందీప్‌, నేను ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి సందీప్‌కు థ్యాంక్స్‌ చెప్పడం కరెక్ట్‌ కాదన్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌లు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అనీవారి పర్‌ఫార్మెన్స్‌ ఊహించినదానికంటే ఎక్కువే ఇచ్చారని మెచ్చుకున్నారు దర్శకుడు విఐ ఆనంద్‌. సినిమా నచ్చేలా తీయకుంటే.. ఆడియెన్స్‌ స్పెండ్ చేసే రెండున్నర గంటల టైమ్‌ దర్శకుడు వేస్ట్ చేసినట్టేనని.. అందుకోసమే ఎక్కువ కష్టపడ్డామని.. ఆడియెన్స్‌ మెచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రెడీ చేసామన్నారు విఐ ఆనంద్. దీనికోసం తన డైరెక్షన్‌ టీమ్‌ చాలా శాక్రిఫైజ్ చేసారని మెచ్చుకున్నారు.

హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ముద్దు బిడ్డ, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి నేడు. ఆయన్ని స్మరిస్తూ మా ట్రైలర్ ని లాంచ్ చేశాం. దర్శకుడు విఐ ఆనంద్ గారు అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్ళు ఈ చిత్రం కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే బాధ్యత ఎంత వుందో అంతకంత నిర్మాత అనిల్ సుంకర గారికి, రాజాకి, నాకు, సినిమాలో పని చేసి అందరికీ ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం మా అందరికీ చాలా అవసరం. ఆ బాధ్యతని అవసరాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ పని చేశాం. ఇందులో నిజమేనే చెబుతున్నా పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. దీనికి పూర్తి కారణం ప్రేక్షకులు ఆదరణ. చాలా గొప్పగా ఆదరించారు. ఫిబ్రవరి 9న దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్కు, మంచి హ్యుమర్, పాటలు, బోలెడంత యాక్షన్ వున్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఊరు పేరు భైరవకోన కమర్షియల్లీ ప్యాకేజ్డ్ ఎంటర్ టైనర్. ఫిబ్రవరి 9న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండాఅందరినీ ఎంటర్ టైనర్ చేస్తుందిఅన్నారు

Leave a comment

error: Content is protected !!