నటీనటులు : ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, అప్పాజి తదితరులు

సంగీతం: విన్నూ వినోద్‌

సినిమాటోగ్రఫీ: ఈజె.వేణు

నిర్మాత : సుభాశ్‌ కట్టా, చందన కట్టా

దర్శకత్వం: దివ్యభావన

రిలీజ్‌ డేట్‌ : జులై 7, 2023

లైఫ్‌ లో ఫస్ట్‌ లవ్‌ అనేది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. అది మిగిల్చే అనుభూతి ఛేదైనా తీపైనా మనసులో ఎప్పటికీ చెరిగిపోని ఓ సంతకం. అలాంటి ఫస్ట్‌లవ్‌ కాన్సెప్ట్‌తో యూత్‌ సెక్షన్‌ ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా ‘ ఓ సాథియా ‘. ఆర్యన్‌ గౌర, మిష్టి చక్రవర్తి కాంబినేషన్‌తో దివ్య భావన డెబ్యూ డైరెక్షన్‌లో జఈ సినిమా అనుకున్నట్టే మొదటి ప్రేమను గుర్తు చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ : అర్జున్‌ ( ఆర్యన్‌ గౌర) వైజాగ్‌లో బిటెక్ స్టూడెంట్‌.. మొదటి చూపులోనే కీర్తి ( మిష్టి చక్రవర్తి) ని ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓరోజు కీర్తి ఊరొదిలి వెళ్లిపోవడం, ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ రావడంతో ఆల్‌మోస్ట్ దేవదాసులా మారిపోతాడు. తండ్రి చేసిన జ్ఞానబోధతో మళ్లీ మామూలై తన పని తాను చేసుకుంటున్న అర్జున్‌కు కీర్తి అడ్రస్‌ తెలుస్తుంది. కీర్తి కోసం వెళ్లిన అర్జున్‌ ప్రేమ గెలిచిందా.. కీర్తి అర్జున్‌ ప్రేమను యాక్సెప్ట్ చేసిందా ? అసలు ఉన్నట్టుండి కీర్తి ఊరొదిలి వెళ్లిపోవడం వెనుక అసలు కారణమేంటి అనేది వెండితెరపై చూడాల్సిందే.

కథనం – విశ్లేషణ : తొలి చూపులోనే ప్రేమ అనేది ఎప్పటికీ సక్సెస్‌ఫుల్ కాన్సెప్ట్‌. యూత్‌ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌ ఇది. లవ్‌ సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడంలో ఓ సౌకర్యం ఉంటుంది. యాక్టర్స్‌ కరెక్ట్‌ గా పర్‌ఫార్మ్‌చేయగలిగితే యూత్‌ఫుల్ సీన్స్‌తో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌ చేయొచ్చు. ఓ చిన్న కాన్‌ఫ్లిక్ట్ నుంచి ఇంటెన్స్‌ ఎమోషన్‌ ప్రజెంట్ చేయొచ్చు. ఓవరాల్ గా ప్రతీ సీన్‌ యూత్‌ తమను తాము చూసుకునేలా చేయొచ్చు. ఇలా చేయడంలో ఓ సాథియా చాలా వరకు సక్సెస్‌ అయ్యిందనే చెప్పొచ్చు. తెలుగు తెరపై మరిచిపోలేని క్లాసిక్‌ లవ్‌స్టోరీస్ ఎన్నో వచ్చాయి. ఖుషీ లాంటి కల్ట్‌ క్లాసిక్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ని చూసాం. ఈ సినిమా ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడానికి ప్రయత్నించకుండా.. టీనేజ్‌లో కలిగే తొలిప్రేమ అనుభూతుల్ని .. ఆ ఏజ్‌లో ఉండే కన్‌ఫ్యూజన్‌ని జెన్యూన్‌ గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించింది డైరెక్టర్‌ దివ్య భావన. రూల్‌ బుక్‌లో ఉన్నట్టుగానే హీరో ఉండాలని కాకుండా.. హీరోయిన్ చేతిలో ఎన్నోసార్లు ఫూల్ అవుతాడు హీరో. ఈ క్రమంలో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ పంచింది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినపుడు ఎవరెంత మెచ్యూర్‌డ్ గా ప్రవర్తిస్తారో అనేదే కీలకం. మొదటి నుంచి హీరో క్యారెక్టర్‌పై సానుభూతి కలిగేలా.. హీరోయిన్‌ని వాడుకుని వదిలేసే రకంలా ప్రజెంట్ చేసినా.. చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌ దివ్యభావనలోని డైరెక్షన్‌ క్వాలిటీస్‌ని మెచ్చుకునేలా చేస్తుంది. ఈ సినిమాలో లోటుపాట్లు లేకపోలేదు. క్లాసిక్‌ లవ్‌స్టోరీస్‌ కేటగిరీలో చేరదగ్గ సినిమా అని చెప్పలేం కానీ.. ఫస్ట్‌ లవ్‌ రోజుల్ని గుర్తుకు తెచ్చే సినిమాగా చెప్పొచ్చు. పవన్‌ కళ్యాణ్‌ ఖుషీ సినిమా రిఫరెన్స్‌లు తెలివిగా వాడుకుని ఎంటర్‌టైన్ చేసింది డైరెక్టర్‌ దివ్యభావన.

ఆర్టిస్ట్‌లు :
ఆర్యన్‌ గౌర లో ఈజ్‌ ఉంది. కరెక్ట్‌గా నడిపించగలిగితే చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ పండించగలడు. ఈ సినిమా వరకు ఎంత న్యాయం చేయాలో అంతా చేసాడని చెప్పొచ్చు. టీనేజ్‌ కుర్రాళ్లలో ఉండే అల్లరితనం, ఎమోషన్స్‌ పండించడంలో కూడా ఈజ్‌ చూపించాడు. మిష్టి చక్రవర్తి గతంలో కంటే బ్యూటిఫుల్ గా కనిపించింది. చినదాన నీకోసంతో పోల్చితే ఇందులో చాలా యంగ్‌ అమ్మాయిలా కనిపించింది. పర్‌ఫార్మెన్స్‌ కూడా అదరగొట్టింది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్‌ చాలా బాగా చేసారు. దేవి ప్రసాద్‌ సహా మిగతా వారు ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

టెక్నిషియన్స్ : లవ్‌స్టోరీస్‌ ను డీల్ చేయడంలో దివ్యభావన తొలిసినిమాతోనే టాలెంట్ ఉందనిపించుకుంది. విన్ను మ్యూజిక్‌ పర్వాలేదు. గుర్తుపెట్టుకునేంత గొప్ప పాటలైతే లేవు ఇందులో. ఇక ఫోటోగ్రఫికి మంచి మార్కులే ఇవ్వొచ్చు. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త స్పీడ్‌ పెంచితే బావుండేది. స్లో నేరేషన్‌ ఈ సినిమాకి మెయిన్ మైనస్‌. పాటలు కథ ఫ్లోని చెడగొట్టాయనే చెప్పొచ్చు. ఓవరాల్‌గా యూత్‌ ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో.. ఈ సినిమాకు పనిచేసిన అన్ని శాఖలు బాగా పనిచేసాయి. టెక్నిషియన్స్‌ అందరికీ పాస్‌ మార్కులు పడతాయి.

బోటమ్‌ లైన్‌ : ఓ సాథియా.. ఫస్ట్‌ లవ్‌ మేనియా
రేటింగ్ : 3 / 5

Leave a comment

error: Content is protected !!