Pekamedalu movie : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నుండి రాకేష్ వర్రే నిర్మాతగా, హీరోగా నటించిన “ఎవరికీ చెప్పొద్దు” సినిమా థియేటర్స్ లోనూ, ఓటీటీలోనూ మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుండి రెండవ సినిమాగా ‘పేక మేడలు’ రాబోతోంది. ఈ సినిమాతో వినోద్ కిషన్ తెలుగులో హీరోగా పరిచయం కానున్నారు. గతంలో “నా పేరు శివ”, “అంధగారం”, “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” వంటి సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ ఈ సినిమాలో అనూష కృష్ణ సరసన నటించనున్నారు.

ఇటీవల విడుదలైన పేకమేడలు చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ట్రైలర్‌లో కామెడీ, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. వినూత్నమైన ప్రమోషన్లతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. QR స్కాన్‌లు, బంతితో చేసిన ప్రమోషన్లు విజయవంతమయ్యాయి. ఈ కొత్త ప్రమోషన్స్ ను కొనసాగిస్తూ, చిత్ర నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలకు టికెట్ ధర కేవలం ₹50 మాత్రమే. ఈ ప్రత్యేక ప్రదర్శనలు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో జూలై 19న జరగనున్నాయి. ఈ ప్రమోషన్ల ఫలితంగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చి చిత్రాన్ని విడుదల చేయడానికి ఆసక్తి చూపించారు. జూలై 19న “పేక మేడలు” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a comment

error: Content is protected !!