రోడ్‌ ట్రిప్‌ జానర్‌ సినిమాలు ఎప్పుడూ థ్రిల్‌ చేస్తూనే ఉంటాయి. అలాంటి జానర్‌లో వస్తున్న మూవీ ఆన్‌ ది రోడ్‌. సూర్య లక్కోజు దర్శకత్వం వహిస్తూ.. రాజేష్‌ శర్మ తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాఘవ్‌ తివారి, స్వాతి మెహ్రా మెయిన్‌ లీడ్ చేస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్‌ లుక్స్, ట్రైలర్‌ ను క్రియేటివ్ జీనియస్ రామ్‌ గోపాల్‌ వర్మ రిలీజ్‌ చేసారు. వర్మతో కలిసి వర్క్‌ చేసిన అనుభవం ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు కు ఉంది. ఈ సినిమాను పూర్తిగా లడఖ్‌ ప్రాంతంలో చిత్రీకరించారు. విజువల్‌ మూడ్‌, స్టైలిష్‌ లుక్‌ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు ఆర్జీవి.

ఇదొక రోడ్ ట్రిప్ థ్రిల్లర్ అయినప్పటికీ, సేఫ్ గా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఒక జంటతో ఒక సాధారణ వ్యక్తి కలవడం, అతను వారితో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చోటు చేసుకున్న కల్లోల సంఘటనలే ఈ చిత్ర కథాంశమని తెలిపారు దర్శక నిర్మాత సూర్య లక్కోజు.

తన మొదటి సినిమా లడఖ్ లాంటి అందమైన ప్రాంతంలో తెరకెక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరిగా అందకపోవడం లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో షూటింగ్ చేయడంతో స్వాతి మెహ్రా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు హీరోయిన్‌ స్వాతి మెహ్రా.

Leave a comment

error: Content is protected !!