చిత్రం : అమ్మాయి క్రైమ్ స్టోరీ

నటీనటులుకీర్తి చావ్లా, సాధికా, ఆధీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు మరియు నీలగల్ రవి తదితరులు

బ్యానర్ : చిన్నా ప్రొడక్షన్స్

ఎడిటర్ : మేనగ శ్రీను

నిర్మాతలు : ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్

డైరెక్టర్ : జి.సురేందర్ రెడ్డి

అమ్మాయి క్రైమ్ స్టోరీచిన్నా ప్రొడక్షన్స్ పతాకంపై  కీర్తి చావ్లా ప్రధాన పాత్రలో జి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ హర్రర్ సినిమా. సినిమా ద్వారా  సాధికా, ఆధీ ప్రేమ్, కవిత, రవళి, శ్రీమాన్, గౌతమ్ రాజు మరియు నీలగల్ రవి తదితరులను నూతన నటినటులు పరిచయం అయ్యారు. సినిమాను  ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ లు కలిసి సంయుక్తంగా నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకొచ్చిన అమ్మాయి క్రైమ్ స్టోరీఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ :

ఆనంద్(శ్రీమాన్) కీర్తి చావ్లాలు పెళ్ళైన భార్యభర్తలు. ఆనంద్ తండ్రి చేసిన రెండు లక్షలు అప్పు తీర్చడానికి ఉద్యోగం కోసం సిటీకి వెళ్తాడు. ఉద్యోగం వెతికే క్రమంలో ఆనంద్ కు ఎవరో పోగొట్టుకున్న బ్యాగ్ దొరుకుతుంది. బ్యాగ్ కార్ల కంపెనీ ఓనర్ (సాధిక)దగ్గర పని చేసే అకౌంట్ మేనేజర్ 5 లక్షలు డ్రా చేసుకొని వస్తుండగా పోగొట్టుకుని ఉంటాడు. అందులోని అడ్రస్ చూసి ఆనంద్ డబ్బును తను పనిచేస్తున్న కార్ల కంపెనీ కు వెళ్లి  తిరిగి ఇస్తాడు. అతని సినియార్టీ నచ్చి సాధిక తనకు ఉద్యోగం ఇస్తుంది. తన ఆర్ధిక పరిస్థితి గురించి చెప్పినఆనంద్  కు  అడ్వాన్స్ గా రెండు లక్షల డిడి ఇస్తుంది. ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో ఊరికి ఫోన్ చేసి భార్యకు చెపుతాడు. దాంతో కీర్తి చావ్లా పట్నంకు వస్తుంది. అక్కడ తన భర్త సాధిక తో క్లోజ్ గా ఉండడం చూసి కొపంతో సాధికను అవమాన పరచి ఇంట్లోనుండి బయటకు గెంటేస్తుంది కీర్తి చావ్లా. అవమానం తట్టుకోలేక కీర్తి చావ్లా నుండి ఆనంద్ ను విడగొట్టి ఎలాగైనా ఆనంద్ ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంది సాధిక. క్రమంలో సాధిక ఇంట్లో పనిచేసే సర్వెంట్ చనిపోతే నేరాన్ని ఆనంద్ పై మోపి పోలీసులకు పట్టిస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో సాధిక చెప్పినట్లే చేస్తుంది కీర్తి చావ్లా. ఇకనుండి ఆనంద్ తనతోనే ఉండాలని కండిషన్ పెడుతుంది.అలాగే రాత్రికి తన దగ్గరికి పంపమని కీర్తి చావ్లాకు చెప్పి వెళుతుంది సాధిక. రాత్రి సాధిక హత్యకు గురైతుంది. ఆనంద్ ను పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. సాధిక ను ఎవరు హత్య చేశారు..? అలాగే సాధిక ఇంట్లో పని చేసే సర్వెంట్ ఎలా చనిపోయాడు?  సాధిక ను చంపాల్సిన అవసరం ఎవరికుంది..? ఆనంద్ జైలునుండి నిర్దోషిగా  బయటికి వచ్చాడా? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

సినిమాలోని నటించిన అందరూ నూతన నటీనటులు  మంచి నటనను కనబరిచారు. హీరోగా నటించిన ఆనంద్(శ్రీమాన్) పర్వాలేదని పించాడు.ఇక కీర్తి చావ్లా, సాధిక ఇద్దరు తన గ్లామర్ తో ఆకట్టుకున్నారు. సీనియర్ నటి రవళి చక్కగా నటించింది. ఇంకా సినిమాలో నటించిన కమెడియన్స్ తమదైన హాస్యాన్ని పండించారు. మిగిలిన వారంతా తమ  పాత్రలతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితనం :

సంగీత దర్శకుడు అందించిన పాటలతో పాటు నేపధ్య సంగీతం సినిమా స్థాయికి తగినట్లుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ మేనగ శ్రీను షార్ట్ అండ్ స్వీట్ గా కట్ చేసాడు. సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్  పోతూరి, శాకముద్ర శ్రీధర్ లు సినిమాని నిర్మించారు.

రేటింగ్ : 2.5/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

 

Leave a comment

error: Content is protected !!