Shopping Cart 0 items - $0.00 0

న్యాయంకోసం

 

 

యాంగ్రీ హీరో రాజశేఖర్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘న్యాయంకోసం’. 1988లో విడుదలైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. వసంత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో .. కె.వెంకటేశ్వరరావు (చిరంజీవి తోడల్లుడు ) నిర్మించిన ఈ సినిమా మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సీత కథానాయికగా నటించగా.. భాగ్య, అల్లు రామలింగయ్య, దేవదాస్ కనకాల, సుధాకర్ , నారాయణరావు, మహర్షి రాఘవ, కైకాల సత్యనారాయణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కథానాయిక సీత అక్క .. తన అత్తింటిలో అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. దాన్ని ఆత్మ హత్య అని  పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ సీత పెద్ద ఎత్తున యాజిటేషన్ లేవనెత్తి .. ఆకేసు ను సిబిఐకి అప్పగించేలా చేస్తుంది. రంగంలోకి దిగిన సీబీఐ ఆఫీసర్ రాజశేఖర్.. చివరికి ఆమెను  చంపిన వారిని చట్టానికి పట్టించడమే సినిమా కథాంశం. నిజానికి ఈ సినిమా మలయాళ సూపర్ హిట్టు చిత్రం ‘ఒరు సిబిఐ డైరీ కురిప్పు’ కు రీమేక్ వెర్షన్. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి కె.మధు దర్శకుడు. మలయాళ చిత్ర కథను ఏమాత్రం మార్చకుండా.. కొద్ది పాటి మార్పులతో ఆ సినిమా ను ‘న్యాయం కోసం’ గా తెరకెక్కించాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి.  ఇందులో రాజశేఖర్ చాలా లేట్ గా తెరమీద కనిపిస్తాడు. అయినప్పటికీ ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.

Leave a comment

error: Content is protected !!