తెలుగు అనే కాదు ఏ భాషలో అయినా ఎప్పటికీ గొప్ప అనుభూతిని పంచేది అమ్మ అనే పదం. ఇక అమ్మ ప్రేమను పదం కట్టి పాడితే ఎంతటి గొప్పవాడైనా పసితనపు స్వచ్చమైన అనుభూతితో అమ్మ ప్రేమరాగాన్ని ఆస్వాదిస్తాడు. అలాంటి గొప్ప ప్రయత్నాన్ని చేసింది నివృత్తి వైబ్స్‌ సంస్థ. అమ్మతో సమానం మాతృభాష. 2023 ఫిబ్రవరి 21 న మాతృభాషా దినోత్సవ సందర్భంగా అమ్మపాటను అందించింది నివృత్తి వైబ్స్‌. నటి ఆమని, బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌ లపై “నువ్వే కావాలి అమ్మ” అంటూ అద్భుతమైన పాటను ప్రేక్షకులకు అందించింది. ఈ పాట నివృత్తి వైబ్స్ యూట్యూబ్ చానల్ ద్వారా నెటిజన్స్‌ హార్ట్‌ను టచ్‌ చేస్తూ అద్భుతమైన ఆదరణ పొందుతుంది. 

నువ్వే కావాలి అమ్మ పాటను రంజిత్‌కుమార్ రిక్కీ రాయగా.. మౌనీస్‌ కుమార్ కల్ల అద్భుతంగా బాణీ కట్టారు. ఈ పాటకు సూపర్బ్ కాన్సెప్ట్‌తో స్క్రీన్‌ప్లే డైరెక్షన్‌ చేసింది సందీప్‌ సన్ను, జ్యోతికుమార్‌ కున్నూరు ఈ పాటకు నిర్మాత.

Leave a comment

error: Content is protected !!