NTR : ‘దేవర‘ చిత్రీకరణలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థాయ్‌లాండ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ లో కొంత విరామం తర్వాత తారక్ మళ్లీ బిజీ కానున్నాడు. దేవర సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభుతాన్ని చూపుతుందో వేచి చూడాలి.

Leave a comment

error: Content is protected !!