NTR : యంగ్ టైగర్ యన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. ఈ సినిమాలోని తన పాత్ర షూటింగ్ పూర్తయిందని యన్టీఆర్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈ చిత్రం తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని.. టీంతో కలిసి గడిపిన కాలం తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. దర్శకుడు శివతో కలిసి సెట్స్‌లో దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు.

సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా అదరగొట్టబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో .. భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ మూవీ తర్వాత యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లోని రెండో సినిమాగా రాబోతున్న దేవర ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!