NTR 31 : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ క్రేజీ కాంబినేషన్ లో రానున్న సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘దేవర’ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ ఈ సినిమా గురించి కీలక విషయాలను వెల్లడించారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్‌ 40 రోజుల పాటు జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో నేను పాల్గొనను. ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. నేను జనవరిలో ఈ సినిమా షూటింగ్‌లో చేరతాను” అని తెలిపారు.  ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ‘దేవర 2’లో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!