‘చిత్రలహరి , ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో తిరిగి ఫామ్ లోకొచ్చాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ. తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే మూవీతో రాబోతున్నాడు. సుబ్బు అనే కొత్త కుర్రోడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిజానికి ఈ నెల్లోనే విడుదలవ్వాలి. లాక్ డౌన్ కారణంగా .. విడుదల వాయిదా వేసుకుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని మొదటి సింగిల్ ను విడుదల చేశారు. నో పెళ్లి అంటూ సాగే ఈ పాట ద్వారా .. పెళ్లిలో చేసుకుంటే కలిగే బాధల్ని, బాధ్యతల్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు గీత రచయిత రఘురామ్. తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట .. యూ ట్యూబ్ లో అప్పుడే 1 మిలియన్ వ్యూస్ ను టచ్ చేయడం విశేషంగా మారింది.
లిరిక్స్ సింపుల్ గా క్యాచీగా ఉన్నాయి.. అర్మాన్ పాడిన తీరు కూడా బాగానే ఉంది ఇక ఈ సాంగ్ వీడియోలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ – రానా దగ్గుబాటి కనిపించడం విశేషం. అసలే ఇద్దరూ మెగా హీరోలు బ్యాచిలర్లు.. ఇలా సభ్యసమాజానికి నో పెళ్లి మెసేజ్ ఇస్తున్నారు.. ఆ మెసేజ్ ను త్వరలో ఒకింటివాడు కాబోతున్న నితిన్ చేతే విడుదల చేయించారు. ఇదీ హైలైట్ అంటే..!