అనగనగా ఓ మలయాళీ అమ్మాయి కాదు… కాదు… తెలుగు అమ్మాయి అది కూడా కాదు… మన అమ్మాయి అని ఎవరికి వారు ఓన్ చేసుకునేంతలా చక్కని నటనను కనబరించిన వర్ధమాననటి నిత్యమీనన్.
‘ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు ఇవి కాదా మా ఆస్తులు’ అంటూ… గుండ్రటి కళ్ళు , రింగు రింగులు తిరిగిన కురులు, చూడగానే ఆకర్షించే అందమైన మోము తన సొంతం. ‘అలా మొదలైంది’ లో తన అందం అభినయంతో తెలుగువారిని ఆకట్టుకుంది. ఈ మలయాళి కుట్టి పలికే ముద్దు ముద్దు మాటలకు… విసిరే బాణం లాంటి చూపులకు… కవ్వించే చిలిపి చిలిపి నవ్వులకు… ‘ఇష్క్’ లో పడిన యువత హృదయాలను ‘గుండె జారి గల్లంతయ్యేలా’ చేసింది. ప్రస్తుతం హీరోయిన్స్ ల మధ్య కాంపిటీషన్ ఎక్కువున్న తరుణంలోను అటు గ్లామర్ ను ఇటు పెర్ఫార్మెన్స్ ను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సహజమైన నటనతో అభిమానులను సొంతం చేసుకుంది నిత్య. తను చేసే సినిమాలలోని పాటలను పాడుతూ గాయనిగా… డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను… ప్రతిభ చూపించింది ఈ బొద్దుగుమ్మ. నిత్య ను మన తెలుగమ్మాయి అంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే అంత చక్కగా తెలుగును మాట్లాడుతుంది. సినిమా మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు కన్సిస్టెంట్ గా ఎమోషన్ ను క్యారి చేయగల నటి కాబట్టే తమ సినిమాలలో పెర్ఫార్మెన్స్ రోల్స్కి డైరెక్టర్స్ ల మొదటి ఛాయిస్ నిత్యనే. ఎటువంటి పాత్రనైన సులువుగా పోషించడమే కాకుకుండా తన అందం అభినయంతో ఆ పాత్రకు మరింత అందాన్ని తీసుకువస్తుంది నిత్య.తను చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా అటు యువతను ఇటు ఫ్యామిలి ఆడియన్స్ ను ఆకట్టుకునే పాత్రలను ఎంచుకుంది. నిత్య మరెన్నో మంచి పాత్రల ద్వారా చక్కని నటనని కనబరుస్తు అభిమానులను ప్రేక్షకులను అలరించాలని కేరళ కుట్టికి బర్త్ డే విషెస్ తెలుపుతుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!