యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రంగ్ దే చిత్రంలో కీర్తి సురేశ్ తో జోడీ కడుతున్నాడు. దీంతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ, అంధాధున్ బాలీవుడ్ రీమేక్ లోనూ నటించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్స్ ఇంకా మొదలు కాకపోవడంతో .. ఈ హీరో ఇప్పుడు తన పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన అతడి పెళ్ళి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు జూలై 26న వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. నితిన్ ఇటీవల తన గర్లఫ్రెండ్ శాలినితో నిశ్చి తార్థం చేసుకున్నాడు. ఇక పెళ్లిని ఘనంగా చేసుకోవాలనీ భావించిన నితిన్ మొదట దుబాయ్లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని భావించాడు. అయితే కరోనా కారణంగా అలా వేసుకున్న ప్లాన్ ముందుకు సాగలేదు. ఇక చేసేందేం లేక నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాడు. కానీ తాజా సమాచారం ప్రకారం నితిన్ తన పెళ్ళిని ఈ నెల 26న చేసుకోనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ వివాహం హైదరాబాద్లో వధువు ఇంటి వద్దే జరుగునుందట.