నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్‌ . సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు చిత్ర యూనిట్. అలాగే ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో నితిన్‌ అంధుడిగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నితిన్ కళ్ళకు అద్దాలు, చేతిలో స్టిక్ పట్టుకుని ఉండగా… బ్యాగ్రౌండ్ లో రక్తపు మరకలున్న పియానో తరహా స్టెప్స్ ను చూపించారు. నితిన్‌ సరసన నభా నటేశ్‌ నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ప్రధానపాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ‘భీష్మ’ సినిమాకి సంగీతం అందించిన మహతీ స్వరసాగర్. సినిమా జూన్‌ 11న విడుదల కానుంది. బాలీవుడ్ ఆంధాధున్ సినిమా కి రీమేక్ కి ఈ సినిమా రీమేక్. తెలుగు లో  ఈ చిత్రాన్ని  నితిన్ చేస్తుండగా తమిళం లో ప్రశాంత్ అంధాగన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. 

Leave a comment

error: Content is protected !!