చిత్రం : చెక్

నటీనటులు : నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు

సంగీతం : కళ్యాణిమాలిక్

ఎడిటింగ్‌ : చోటా కె ప్రసాద్‌

ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్

ఆర్ట్ : వివేక్ అన్నామలై

ఎడిటింగ్ : అనల్అనిరుద్దన్

నిర్మాత : వి.ఆనంద ప్రసాద్

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి

విడుదల : 26-02-2021

గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నితిన్. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటితో చేసిన ‘చెక్’ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీగా కనిపంచనున్నాడు. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ ను ఉరిశిక్ష నుండి తప్పించే ఓ లాయర్ పాత్రలో నటించింది. మరి ఈ సినిమాతో నితిన్‌ మరో హిట్‌ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’నిప్రేక్షకులను ఎంతల ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ : 2014లో జరిగిన బాంబు పేలుళ్లను టెర్రరిస్టులతో కలిసి కుట్ర చేశాడన్న అభియోగం ఋజువు కావడంతో వాళ్ళతో పాటు నితిన్ కు ఉరిశిక్ష పడుతుంది. జైలుకు వెళ్ళాక తనలో చెస్ నైపుణ్యాన్ని బయట పెడతాడు. ఇతని తరఫున లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ అప్పీల్ కు వెళ్తుంది. ఈ క్రమంలో నితిన్ తన గతాన్ని బయటపెడతాడు. ప్రియా వారియర్ తో తన ప్రేమకథను చెబుతాడు. అసలు ఇతనంత పెద్ద టెరరిస్ట్ కేస్ లో ఎలా చిక్కుకున్నాడు, చెస్ గేమ్ ద్వారా తన ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడా లదా అనే లాంటి ప్రశ్నలకు సమాధానమే అసలు స్టోరీ.

కథ విశ్లేషణ : ఈ సినిమాలో నితిన్ ఒక తెలివైన యువకుడు. తన తెలివితేటలన్నింటిని చిన్న చిన్న దొంగతనాల కోసం ఉపయోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఇలా ఉండగా అతని జీవితంలోకి ప్రియా ప్రకాశ్‌ వారియర్ పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. తర్వాతఅనుకోని మలుపు వస్తుంది. భారత్‌లో ఉగ్రదాడి జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో నితిన్ కు ఉరిశిక్ష పడుతుంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న తనకి జైలులో సాయిచంద్ సహా ఖైదీగా పరిచయమై నితిన్ కి చెస్‌ ఆటను నేర్పిస్తాడు. తన ఆటతీరును తెలివిని గమనించి నేషనల్‌ చెస్‌ ఛాంపియన్ షిప్‌ గెలుస్తాడని బలంగా నమ్ముతాడు సాయి చంద్. తనకు ఉన్న పలుకుడిబడితో నితిన్ ను చెస్‌ గేమ్‌ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదిలా ఉండగా నితిన్ కు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్‌ లాయర్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెరపై కనిపిస్తుంది. చెస్‌లో ప్రావిణ్యం ఉన్న తనకు ఆమే క్షమాభిక్ష పెట్టెలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఉండగా కన్నింగ్ ఎస్పీ గా సంపత్‌ రాజ్‌ నితిన్ కు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి నితిన్ కు క్షమాభిక్ష లభించిందా లేదా? అసలు ఉగ్రదాడి కేసులో ఎలా బుక్‌ అయ్యాడు? ప్రియా ప్రకాష్ నితిన్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏమైంది? చెస్‌ గేమ్‌ తనకు ఉరిశిక్ష నుండి తప్పించ్చుకోవడానికి ఎలా ఉపయోగపడింది? సంపత్ రాజ్ కు నితిన్ అంటే ఎందుకు కోపం? చివరకు జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్ : నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీగా, చెస్ ప్లేయర్‌గా, ప్రేమికుడిగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న నటుడిగా నితిన్ కనిపిస్తాడు. ఫైట్స్ విషయంలో చెక్‌లో కాస్త విజృంభించాడనే చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో నితిన్‌లో మెచ్యురిటీ కనిపిస్తుంది. ఓవరాల్‌గా నితిన్ పర్‌ఫెక్ట్‌గా ఒదిగిపోయాడని చెప్పవచ్చు. ప్రియా ప్రకాశ్ వారియర్ పాత్ర విషయానికి వస్తే తెరపై కనపడింది కొద్దిసేపైన కూడా సినిమా ఆద్యంతం ఆ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. తన పాత్ర సినిమా కీలక సన్నివేశాలలో ప్రభావం అనేది ఉంటుంది. అలాగే గ్లామర్‌ తో & ఒక పాటలో నితిన్‌తో కలిసి ఆడిపాడి ఆడియన్స్ ను తన అందచందాలతో బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ టైం రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ రోల్ కాక్కుండా సినిమా కథకు అవసరమైన పాత్రలో కనిపించింది. లాయర్ పాత్రలో పలికించిన హావభావాలు తెరపై మంచిగా పండాయి. గ్లామర్ అవకాశం లేకున్న తన లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లలో చక్కటి నటనను ప్రదర్శించింది. సీనియర్ యాక్టర్ సాయిచంద్ పాత్ర ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. అరుదైన నటనతో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకొనే పాత్రలో మెప్పించారు. అలాగే మురళీ శర్మ పాత్ర ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. ఇక నెగిటివ్ షేడ్ కోణంలో సాగే సంపత్ రాజ్ పాత్ర కూడా సెకండాఫ్‌లో కీలకంగా మారింది. హర్షవర్ధన్, పోసాని పాత్రలు సినిమాలో కామెడిని పండించేలా సాగాయి. కల్యాణీ మాలిక్ మ్యూజిక్ చెక్ సినిమాను మరో రెంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాకు ప్రాణంగా మారింది. కొన్ని సన్నివేశాలను తన బీజీఎంతో కల్యాణీ మాలిక్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. గత చిత్రాలతో పోల్చుకొంటే చెక్ సినిమాకు కల్యాణీ మాలిక్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ఢిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమాకి రాహుల్ శ్రీవాస్తవ్ అందించిన సినిమాటోగ్రఫిని ముందుగా చెప్పుకోవాలి. సినిమా ఎక్కువ భాగం జైల్ నేపధ్యం లో సాగుతుంది. అలాంటి కత్తి మీద సాము లాంటి జైల్ ఎపిసోడ్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. జైలుగదిలో తీసిన ఫైట్ చాలా బాగుంటుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. జైల్ సెట్ తెరపై వాస్తవికతను ఉట్టిపడేలా చేసింది.

చివరిగా : పూర్తిస్థాయిలో చెక్ పెట్టలేకపోయింది

రేటింగ్ :  3/5

Leave a comment

error: Content is protected !!