అందమైన ముఖానికి చిరునవ్వు అలంకరించుకొని.. చక్రల్లాంటి కళ్ళను చిలిపిగా ఎగరేస్తూ.. కొంటె చూపుల్ని కుర్రకారుకు గుండెలకు గుచ్చి.. వెండితెరమీద తన అభినయ విన్యాసాన్ని ప్రదర్శించిన నిన్నటి తరం నటీ మణి రజని. ఒక్క చిరంజీవి తప్ప.. అప్పటి అందరు అగ్ర కథానాయకుల సరసన నటించిన ఆ అందాల పున్నమి .. టాలీవుడ్ లో ఎయిటీస్ , నైంటీస్ లో హీరోయిన్ గా అగ్రపథాన నిలిచింది.  అప్పటి కథా నాయికలకు ఒక దశలో పోటీ గా నిలిచిన ఆ సుందరి .. లెక్కకు మించిన చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించింది.

దాసరినారాయణ రావు బ్రహ్మముడి చిత్రంతో టాలీవుడ్ లో కథానాయికగా రంగ ప్రవేశం చేసిన రజనీ.. ఇటు టాప్ హీరోలతో నటిస్తూనే.. అటు.. రాజేంద్రప్రసాద్ లాంటి కామెడీ హీరోల సరసన కూడా నటించి.. సత్తా చాటుకుంది. తెలుగు ,తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో  చెప్పుకో దగ్గ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆ అందాల నటీమణికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే రజనీ  

Leave a comment

error: Content is protected !!