ఎనర్జిటిక్ యాక్టింగ్ .. ఎక్స్ పెరిమెంటల్ మెంటాలిటీ.. ఆత్మ విశ్వాసం తొణికిసలాడే వ్యక్తిత్వం.. అపజయాలకు భయపడని తత్వం .. విజయమే ప్రధానంగా దూసుకుపోయే నైజం .. యంగ్ హీరో నిఖిల్ ప్రత్యేకతలు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకున్న కథానాయకుడు అతడు. చిన్న చిన్నపాత్రలతో తన కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు వైవిధ్యమైన చిత్రాలకు, విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరుగా మారాడు.
దశరథ్ సంబరం చిత్రంలో ఒక చిన్నపాత్ర తో టాలీవుడ్ లో తన కెరీర్ ను ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్ధ .. డెక్కన్ మూవీ … హైద్రాబాద్ నవాబ్స్ లో ఒక హాస్య పాత్ర పోషించి.. మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రెడిట్ తో శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లో ఒక హీరోగా సత్తా చాటుకున్నాడు. ఆపై యువతలో హీరోగా మెరిసి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి నిఖిల్ టాలీవుడ్ లో మంచి మంచి కథలను ఎంచుకొని .. పలు విజయాలు సొంతం చేసుకొన్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడా, కేశవ లాంటి చిత్రాలతో యంగ్ తరంగమై.. విరుచుకుపడ్డాడు. గత నెల 15న పెళ్ళిచేసుకొని ఒక ఇంటివాడైన నిఖిల్ సిధ్ధార్ధ .. ప్రస్తుతం పలు వైవిధ్యమైన చిత్రాలకు కమిట్ అయ్యాడు. నేడు నిఖిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే నిఖిల్ సిద్ధార్ధ