కరోనా వైరస్ ప్రభావం వల్ల . గత రెండు నెలలకు పైగానే… తమ పుట్టిన రోజు వేడుకల్ని అభిమానుల మధ్య జరుపుకోవడమే మానేశారు టాలీవుడ్ హీరోలు. కేవలం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఒక కేట్ కట్ చేసి.. సింపుల్ గా ఆ వేడుకను కానిచ్చేస్తున్నారు. అయితే ఈ మధ్యనే పరిమిత అతిథుల సమక్షంలో సింపుల్ గా పెళ్ళి చేసుకొన్న యంగ్ హీరో నిఖిల్ మాత్ర తన పుట్టిన రోజును అందరూ మెచ్చుకొనే రీతిలో చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
గన్నవరంలోని ఓ ఛారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అనాధ శరణాలయానికి వెళ్లి.. నిఖిల్ పిల్లలకు కావాల్సినవి సమకూర్చి వారి మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఏడాది తన పుట్టినరోజును అనాధశరణాలయంలో జరుపుకున్నానని.. సాధారణంగా తన పుట్టినరోజు నాడు చేసే ఖర్చును ఈ పిల్లల కోసం ఇచ్చేశానని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడికి వెళ్ళడానికి ముందు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం చూడొచ్చు. అలాగే ఆ ట్రస్టు నిర్వాహకులతోనూ, అక్కడే ఉంటున్న పిల్లలతోనూ ముచ్చటించాడు. తమ అభిమాన హీరోకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.
.@actor_Nikhil Spent Birthday at Care & Share Charitable Trust Gannavaram which Takes care of Abandoned and Orphaned Kids.. The amount He spend on Birthday party will be contributed to this organisation,https://t.co/rirhiqDien#HappyBirthdayNikhil #HBDNikhilSiddhartha pic.twitter.com/2W0Bf5b8cv
— BARaju (@baraju_SuperHit) June 1, 2020